పరుగులు పెడుతున్న పసిడి
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు ఇది చేదువార్త.
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు ఇది చేదువార్త. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత ప్రియం కానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అరవై వేలు దాటిన బంగారం ధర 65 వేలు దాటడానికి ఎంతో దూరం లేదని చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతాయని ముందుగానే అంచనా వేసిన కొందరు ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉందని తెలిసి, డిమాండ్ అధికంగా ఉంటుందని భావించి ముందుగానే కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ మరింత పెరిగింది.
పెరగడానికి...
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం, కస్టమ్స్ సుంకం పెంచడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. గోల్డ్ బాండ్స్ కంటే ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ అధికమై ధరలు పరుగులు పెడుతున్నాయని అంటున్నారు.
ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,800 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 77,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.