Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... ఈరోజు కొనేసుకోవచ్చు

నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2024-09-22 04:23 GMT

బంగారం అంటేనే ధరలు పెరుగుతాయన్న నానుడి ఉంది. పెరిగే అలవాటు ఒక్క పసిడికి మాత్రమే ఉంటుంది. అది కూడా రోజురోజుకూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పెట్రోలు ఇతర నిత్యావసర ధరలు ఇలా ప్రతి రోజులో పెరగవు. పెరిగితే ఆయిల్ సంస్థలు నెలకు ఒకసారి సమీక్ష చేసి ధరలను పెంచడమో? తగ్గించడమో చేస్తాయి. గ్యాస్ ధరలు కూడా అంతే. కాని పుత్తడి ధరల విషయంలోనే ప్రతి రోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అందుకు ప్రధాన కారణం బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అలాంటిది. అందుకే బంగారం కొనుగోలు చేయాలంటే ప్రతి రోజూ ధరల కోసం చూసి తీరాల్సిందే.

రెండు రోజుల్లోనే...
బంగారం ధరలు సెప్టెంబరు నెలలో కొంత శాంతించాయి. అన్ సీజన్ కావడంతో ధరలు తగ్గుముఖంపట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. అది కూడా వెయ్యి రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. అయితే రానున్న మూడు, నాలుగు నెలలు ఫుల్లు సీజన్. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ధరలు మరితం పెరిగే అవకాశముంటుందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. అందుకే బంగారం కొనుగోలు చేయదలచుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే ఎంత డబ్బు పెట్టినా కొద్ది బంగారమే చేతికి అందుతుంది.
స్థిరంగా ధరలు...
రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముంది. అందుకు తగిన కారణాలు కూడా వ్యాపారులు చెబుతున్నారు. అయితే భారీగా పెరిగినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగవని మాత్రం జ్యుయలరీ దుకాణాల యజమానులు ధీమాగా ఉన్నారు. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,600 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,930 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 98,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News