Gold Rates : 65 వేలకు చేరువలో

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2023-10-30 04:07 GMT

పుత్తడికి డిమాండ్ పెరుగుతోంది. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలకు కళ్లెం పడటం లేదు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడంతో పెళ్లిళ్ల సమయంలో కొనుగోలు చేయాలనుకున్న వారికి ప్రతి రోజూ చేదు వార్త వినపడుతుంది. బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా పెరుగుతూ పోతే పది గ్రాముల బంగారం ధర 65 వేలకు చేరుకునే దూరం ఎంతో లేదన్నది మార్కెట్ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

ధరల పెరుగుదలను...
ధరలు పెరుగుదల అరికట్టడమనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ, డిమాండ్ ను బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. ప్రధానంగా భారతీయ మార్కెట్ లో బంగారు ఆభరణాలకు అధిక డిమాండ్ ఉండటం కారణంగానే ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. సామాన్యులకు అందకుండా బంగారం మారిపోయింది. ఇప్పుడు బంగారం కొనాలంటే పెద్ద యెత్తున సొమ్మును కూడబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగానే పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే పెరిగింది. వెండి ధరలు మాత్రమ నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం 57,410 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,630 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 77.500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News