Gold Price: అనుకున్నట్లే జరిగింది.. భారీగా పతనమైన బంగారం ధర

బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు

Update: 2024-07-23 14:56 GMT

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్‌పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4 శాతంగా ప్రకటించారు. దీంతో ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీగా పతనమైంది.

ఒక్కసారిగా 10 గ్రాములపై రూ. 4 వేల వరకు ధర పతనం కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. 24 క్యారెట్ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70,086కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,495 కు తాకింది. కిలో వెండి ధర రూ. 88 వేలుకు చేరుకుంది. బడ్జెట్‌ లో బంగారంపై ట్యాక్స్ తగ్గడాన్ని ప్రజలు స్వాగతించారు. సరసమైన ధరకు బంగారం, వెండిని ఇకపై కొనుగోలు చేయగలమని భావిస్తున్నారు. బంగారం ధరలు గత వారం చూసిన వారి ఆల్‌టైమ్ గరిష్టాల దగ్గరకు వెళ్లాయి. ఇక బడ్జెట్‌కు 6 రోజుల ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, అయితే కస్టమ్స్ సుంకం తగ్గింపు కారణంగా జూలై 23 న మాత్రమే భారీ తగ్గుదల కనిపించింది.


Tags:    

Similar News