Gold Prices Today : ఈ మాత్రం తగ్గకపోతేనేం.. ఇది తగ్గిందనుకోవాలా?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధర భారీగా తగ్గింది

Update: 2024-02-09 04:09 GMT

బంగారం ధరలు ఎప్పుడూ మరింత ప్రియమవుతాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతో పాటు డాలర్ తో రూపాయి తగ్గుదల, ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయని చెబుతున్నారు. బంగారానికి డిమాండ్ ఎప్పుుడూ తగ్గదు. కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గకపోయినా సరే దిగుమతులు తగ్గడంతో బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయి.

రానున్న రోజుల్లో...
అందులోనూ మూడునెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత ఎగబాకుతాయంటున్నారు. దిగుమతులు తక్కువ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లనే రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. మరోవైపు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఎంత ఎక్కువగా ఉన్నారో.. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు కూడా దేశంలో అంతే సంఖ్యలో ఉన్నారు. అందుకే ధరలు ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గని వస్తువు బంగారం మాత్రమే.
భారీగా వెండి...
ీఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,990 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,220 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 75,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News