Gold Prices : బంగారం ధరలు తగ్గాయ్.. ఇక ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయాలంటే?

దేశంలో నేడు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలలో మాత్రం స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

Update: 2024-01-04 03:13 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గిందంటే సంతోషమే. కానీ తగ్గితే స్వల్పంగానే తగ్గుతుంది. భారీగా తగ్గుదల అప్పుడప్పుడూ అరుదుగానే కనిపిస్తుంటుంది. అప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం బెటర్ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతుంటారు. తగ్గినప్పుడు కొనుగోలు చేయలేకపోతే ఇక భారీగా పెరిగినప్పుడు కొనలేక నోరు వెళ్లబెట్టాల్సి వస్తుందని కూడా వారు చెబుతున్నారు. బంగారం ధరలు పెరిగేవే కానీ తగ్గడం అంటూ ఉండదని కూడా వారు హెచ్చరికలు చెబుతున్నారు.

సీజన్ లేకుండా...
పసిడి కొనుగోలు చేయడానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. గతంలో శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ లో మాత్రమే పసిడికి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. 365 రోజులూ సీజనే. అన్ సీజన్ అనేది లేకుండా ఉండే ఒకే వస్తువు బంగారం అని చెప్పక తప్పదు. అలాగే డిమాండ్ కూడా తగ్గని వస్తువగా ఇప్పటికే పేరు పడింది. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవడంతో ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయాలని జనం కూడా అనుకుంటుండటమే ఇందుకు కారణం.
ధరలు ఇలా...
చాలా రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశంలో నేడు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలలో మాత్రం స్వల్పంగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 250 రూపాయలు తగ్గింది. ఇక కిలో వెండి ధర పై మూడు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,500 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 63,820 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 80,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఈ రేట్లు ఈ విధంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. అందుకే త్వరపడండి. కొనుగోలు చేయండి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News