Gold Prices : బంగారం ధరలు మాత్రం తగ్గాయ్... వెండి ధరలు మాత్రం?

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది.

Update: 2024-01-10 01:47 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కొంత ధర తగ్గుముఖం పట్టడం సంతోషించ దగ్గ విషయం. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొన్ని రోజులు, స్వల్పంగా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు దారులు కూడా ఊరట చెందుతున్నారు. మార్చి నెల వరకూ పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో కొనుగోళ్లు కూడా అధికంగానే ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో తగ్గుతుండటం అరుదుగా చెబుతున్నారు జ్యుయలరీ వ్యాపారులు.

మంచి అవకాశమంటూ...
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మేలు అని సూచిస్తున్నారు కూడా. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. పసిడి, వెండికి అంత డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వాటిని తాము ఇంట్లో ఉండాల్సిన వస్తువులుగా భావించడమే ఇందుకు కారణం. శుభసూచకంగా మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్ గా మారడం కూడా బంగారం కొనుగోళ్లు అధికంగా ఉండటానికి కారణమవుతున్నాయి. ఇతర ఏ వస్తువుకూ లేని డిమాండ్ సీజన్ తో సంబంధం లేకుండా ఒక్క బంగారం విషయంలో మాత్రమే ఉంటుంది.
పెరిగిన వెండి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 76,600 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News