Gold Prices : ధరలు పెరిగాయి... ఎంతంటే మీరు కొనలేనంతగా మాత్రం కాదు

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది

Update: 2023-11-15 02:35 GMT

పసిడి ధరలు అంతే. తగ్గినట్లే తగ్గుతుంటాయి. మళ్లీ పెరుగుతుంటాయి. అది అందరికీ తెలుసు. అయినా డిమాండ్ మాత్రం పసిడికి ఏమాత్రం తగ్గదు. బంగారం ఉంటే భరోసా. కరోనా సమయంలోనూ బంగారం అనేక మందికి ఆసరాగా నిలవడంతో బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు అనేక మంది. అందుకే తమకున్న కొద్దిపాటి సొమ్ములనైనా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుండటంతో దానికి ధరలు పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గదు.

రానున్న కాలంలో...
పెళ్లిళ్ల సీజన్, కార్తీకమాసం కావడంతో కూడా బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. బంగారం ఈ ఏడాది అరవై ఐదు వేల రూపాయలు చేరే సూచనలు న్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారాన్ని తగ్గినప్పుడే కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల కాలంలో బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోళ్లు తగ్గాయని అన్నారు. కానీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది వ్యాపారస్థుల మాటగా ఉంది. రానున్న రోజుల్లో పసిడి మరింత ప్రియంగా మారనుందని చెబుతున్నారు.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,550 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,600 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 76,000 మాత్రం స్థిరంగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News