Gold Prices : ధరలు పెరగలేదని సంబరపడుతున్నారుగా.. ఇప్పుడు చూడండి.. మీకే అర్థమవుతుంది
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు పెరిగింది
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరగకపోవడంతో పసిడి ప్రియులు ఆనందపడుతున్నారు. ఇక బంగారం ధరలు మరింత దిగి వస్తాయని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి నమ్మకంపై నీళ్లు చల్లినట్లయింది. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది డిమాండ్ ఉన్న వస్తువు. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు అది ఒక్కటే. ల్యాండ్ తర్వాత గోల్డ్ కే ఎక్కువ మంది పెట్టుబడిగా భావిస్తుండటంతో ఎప్పుడూ పసిడికి గిరాకీ తగ్గదు.
వెయిట్ చేశారంటే?
అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడే ఇంటికి తెచ్చుకోవాలంటారు. లేకుంటే ఎక్కువ ధరను చెల్లించాల్సి వస్తుంది. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ కొన్ని రోజుల్లో ధరలు పెరగకుండా అవి ఊరించడం మామూలుగా మారిపోయింది. దీంతో ధరలు మరింత దిగజారతాయని భావించి కొనుగోలు కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారికి చేదు వార్త మాత్రం ఖచ్చితంగా అందుతుంది. బంగారం ధరలు పెద్దగా పెరగలేదని సంబరపడినంత సేపు లేదు. అవి పెరగడానికి.
వెండి నిలకడగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూాపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,830 రూపాయలుగా ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో 77,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.