Gold Price Today : వామ్మో.. బంగారం ధరలు ఇలా పెరుగుతుంటే ఇక కొనేదెలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.

Update: 2024-10-23 04:33 GMT

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రతి రోజూ ధరల పెరుగుదల కనిపిస్తుంది. ఎంతో కొంత పెరుగుతూ వినియోగదారులకు షాక్ కు గురి చేస్తూ ఉంది. ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరగడం సహజం. అయితే ధరలు ఇలా పెరుగుతూ పోతే కొనుగోలు చేయడం కూడా అంతే కష్టమవుతుంది. వినియోగదారులకు తమకు అవసరమైన బంగారాన్ని సయితం కొనుగోలు చేయడానికి ముందుకు రారు. పెళ్లిళ్లు, పేరంటాళ్లకు కూడా ఇక బంగారం కొనుగోలు చేయడం మానేసి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటారు. అప్పటి వరకూ ఈ ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటాయనిపిస్తున్నట్లుంది.

సామాన్యులకు...
పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర లక్ష పది వేల రూపాయలను మించిపోయింది. పసిడి ధరలను ఇక పట్టుకోలేమోనంతగా పెరిగిపోతుంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడంతో పాటు మంచి ముహూర్తాలు మొదలు కావడంతో ఇక బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. భవిష్యత్ లో లక్ష రూపాయలకు బంగారం చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే సమయంలో ఇక వెండి ధరలు కూడా అమాంతం పెరిగి వినియోగదారులకు దానికీ దూరం చేసేలా ఉన్నాయి. అందుకే భవిష్యత్ లో పసిడి, వెండికి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.
భారీగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్ష పది వేల రూపాయలు దాటేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,10,100 రూపాయలుగా ట్రెండ్ అవతుంది.


Tags:    

Similar News