Gold Prices Today : గోల్డ్ రేట్లు తగ్గాయిగా.. ఎంత తగ్గాయో తెలిస్తే షాకవుతారంతే
ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండిధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది;

బంగారం ధరలు పెరగడం సాధారణంగా జరిగే విషయమే. అందుకే పెరిగినా మదుపుదారులు, వినియోగదారులు పెద్దగా ఆశ్చర్యపోకుండా కొనుగోలుకు మాత్రం దూరంగా ఉంటున్నారు. బంగారం ధరలు తగ్గితేనే ఆశ్చర్యంగా అనిపించడం ఇప్పడు మామూలయింది. ఎందుకంటే ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుండటమే ఇందుకు కారణం. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరలు అందుబాటులో ఉండకుండా దోబూచులాడుతున్నాయి. కొనుగోలు చేయాలనుకున్నా ధరలను చూసి వెనక్కు తగ్గే వారు అనేక మంది కనిపిస్తుండటంతో పాటు బంగారం ధరలు ఇక తగ్గవన్న నిర్ణయానికి వచ్చారు.
అనేక కారణాలతో...
వడ్డీ రేట్లు తగ్గకపోవడంతో పాటు పెరగడం కూడా బంగారం ధరలు మరింత ప్రియమవ్వడానికి కారణాలుగా చెబుతున్నారు. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి బంగారం, వెండి ధరలుకు రెక్కలు వచ్చాయి. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా నడుస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ మరో నాలుగైదు నెలలు ఉండటంతో ఇక బంగారం ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కాదన్నది అందరికీ తెలిసిందే. బంగారం దిగుమతులు కూడా తగ్గడం ధరలు పెరగడానికి ఒక కారణమని చెప్పాలి.
ధరలు తగ్గి...
బంగారం అంటే ఎవరికి చేదు. అందరూ ఇష్టపడి కష్టపడి కొనుగోలు చేసే వస్తువు కావడంతో అపురూపంగా చూసుకుంటారు. అలాంటి బంగారం, వెండి ధరలు ఇప్పుడు అందరికీ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండిధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. లో 22 క్యారెట్ల బంగారం ధర 82,140 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.89,610 గా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలు పలుకుతుంది.