Gold Price Today : పసిడి కొనుగోలు చేసేవారికి నేడు గుడ్ న్యూస్.. ధరలు పెరగలేదోచ్
దేశంలో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు తీస్తూనే ఉంటాయి. అది ఒకసారి పరుగు అందుకుంటే మాత్రం దానిని ఎవరూ ఆపలేరు. ప్రతి రోజూ పసిడి ధరలు పెరుగుతూ గోల్డ్ లవర్స్ కు షాకిస్తూనే ఉంటాయి. అయినా కొనుగోళ్లు ఆగుతాయా? అంటే లేదు. ఎందుకంటే అవసరాల కంటే పసిడిని స్టేటస్ సింబల్ గా భావించే వాళ్లు అధికంగా ఉన్నారు. ఇటీవలకాలంలో ప్రజల్లో కొనుగోలుశక్తి పెరగడం వల్ల కూడా పసిడి ధరలు పెరిగినా అమ్మకాలపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతాయని అందరికీ తెలుసు. అందుకే దానిని పెట్టుబడిగా భావించి కొందరు, కష్టకాలంలో ఆదుకుంటుందని మరికొందరు డబ్బులున్నప్పుడు కొనుగోలు చేస్తుంటారు.
కొనుగోళ్లు మాత్రం...
ఇక రానున్నది సీజన్. వచ్చే నెల నుంచి కొనుగోళ్లు మరింత ఎక్కువగా ఉంటాయన్న అంచనాలతో జ్యుయలరీ దుకాణాల యజమానులు ఉన్నారు. పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో అందుకు తగినట్లుగా ఆభరణాలను సిద్ధంచేసుకుని మరీ ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ ఒక్కో రాయితీని ప్రకటిస్తూ కొనుగోలుదారులను తమ దుకాణం గడప తొక్కేలా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు మాత్రమే కాకుండా చిన్న దుకాణాలకు కూడా వినియోగదారులు క్యూ కడుతుండటంతో పసిడికి డిమాండ్ అనేది తగ్గేది లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
స్థిరంగా ధరలు...
ఈ నేేపథ్యంలో దేశంలో బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. అయితే మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పులు చేర్పులుంటాయని అందరికీ తెలిసిందే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,160 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 97,900 రూపాయలకు చేరుకుంది.