Gold Prices : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నిలకడగా సాగుతున్న వెండి ధర
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు తగ్గింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి
పసిడి ప్రియులకు సంక్రాంతి ముందు మంచి శుభవార్త చేరింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. పసిడి పతనం ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెద్దగా పెరగడం లేదు. కొన్ని రోజులు స్థిరంగానూ, మరికొన్ని రోజుల్లో కొద్దిగా ధరలు తగ్గుతూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. అయితే ఈ ధరలు ఎప్పటి వరకూ ఇలా ఉంటాయో చెప్పలేమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డాలర్ విలువ పెరగడంతో...
బంగారం ధరలు మొన్నటి వరకూ తారాజువ్వలా పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఏమీ చేయలేక ఎక్కువ మొత్తం వెచ్చించి అయినా కొనుగోలు చేయక పరిస్థితి ఏర్పడింది. మార్చి వరకూ పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ధరలు ఇదే విధంగా పెరుగుతాయని అంచనాలు వినిపించాయి. అయితే గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొంత ఊరట కల్గించే అంశమేనని చెప్పాలి. డాలర్ విలువ పెరగడంతో ధరలు తగ్గాయంటున్నారు.
ఈరోజు ధరలు ఇలా...
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,600 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,830 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో 77,500 రూపాయలు పలుకుతుంది. ఈధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.