Gold Price Today : పండగ రోజు మహిళలకు షాకింగ్ న్యూస్... బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిమొత్తంలోనే పెరిగాయి
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ స్వల్పంగానో ఎంతో కొంత ధరలు తగ్గుతూ వచ్చిన ధరలు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. వరసగా రెండు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. కొనుగోళ్లు ఎక్కువ కావడం, అందుకు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ధరలు పెరగడానికి కేవలం కొనుగోళ్లు మాత్రమే కాదని, అంతర్జాతీయంగా జరిగే పరిణామాలు కూడా ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
వచ్చే నెల నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే గతంలో కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం తగ్గిందని వారు విశ్లేషిస్తున్నారు. బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలు చేయలేని కొందరు తమకు స్థోమతకు తగినంత రీతిలో కొనుగోలు చేస్తున్నారు. కొందరు పెళ్ళిళ్లను ముందుగానే దృష్టిలో పెట్టుకుని నెలవారీ మొత్తం చెల్లించి జ్యుయలరీ దుకాణాల్లో సభ్యులుగా చేరి దానికి కొంత మొత్తం వేసి కొనుగోలు చేస్తుండటం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిమొత్తంలోనే పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఇంకా ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో అవసరమైన వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67.210 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 73,320 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 89,800 రూపాయలుగా ఉంది.