Gold Price Today : బంగారం అందనంతగా... వెండి దొరకనంతగా.. షాకింగ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది.

Update: 2024-09-28 03:20 GMT

బంగారం అంటే అంతే మరి. దాని డిమాండ్ ఏ వస్తువుకూ ఉండదు. విశ్వంలో భూమి తర్వాత అత్యంత విలువైనది బంగారమే. అవును.. రాను రాను బంగారం అనేది అందనంత దూరంలో ఉండిపోయేలా ఉంది. వెండి కూడా చేతికి దొరకనంతగా ధరలు పెరుగుతున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే ధరలు పైపైకి ఎగబాకుతుండటతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయడం గగనంగా మారే అవకాశాలున్నాయి. భవిష్యత్ లో బంగారం, వెండి వస్తువులు కొందరికే పరిమితమవుతాయి. ఈ రెండు వస్తువులు సంపన్నుల జాబితాలోనే చేరిపోతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులే అంగీకరిస్తున్నారు.

కొందరికే ఈ రెండు..
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇక బంగారం, వెండి వస్తువులు అందని ద్రాక్షలుగానే మిగిలిపోయి ఉన్నారు. బంగారం వైపు చూసేందుకు కూడా వారు సాహసించరు. ధరలు చూసి అవాక్కవుతున్నారు. ఎంత డబ్బు పెట్టినా తాము ముచ్చటపడిన ఆభరణాలను కొనుగోలు చేయడానికి వీలులేకుండా పోయింది. అదే సమయంలో కొందరు దీనిని పెట్టుబడిగా భావిస్తూ బంగారం బిస్కెట్లను కొనుగోలు చేస్తూ దాచుకుంటుండటం కూడా హాబీగా మారింది. అందుకే ఫ్యూచర్ లో బంగారం, వెండి ధరలు మన చేతుల్లో ఉండవన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎంతో కొంత కొనుగోలు చేయాల్సి రావడంతో కొనుగోలు చేయగలిగినంత మాత్రమే వారు కొంటారన్నది వాస్తవం.
ధరలు పెరిగి...
బంగారం, వెండి వస్తువులు దూరమయిపోతాయన్న బాధకంటే అది అత్యంత విలువైన వస్తువుగా మారితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరగగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,460 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,02,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News