Gold Prices : తగ్గాయనే సంతోషించేలోగా.. ఈ కబురు వింటామనుకోలేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 330 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి.

Update: 2024-01-20 03:39 GMT

పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఒకరోజు ఊరించినట్లే ఊరించి మళ్లీ పరుగులు తీస్తున్నాయి. వచ్చే మార్చి నెల వరకూ ధరలు పెరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ మార్చి నెల మధ్య వరకూ ఉండటంతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా జరుగుతాయి. అందుకే బంగారం ధరలు ఈ రెండున్నర నెలలూ పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు కొంత ధరలు తగ్గినా.. అవి నామమాత్రమేనని, ధరలు మాత్రం భారీగానే పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

అనేక కారణాలు...
బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయంటే ఆనందమే. తగ్గాయంటే మరీ ‌హ్యాపీ. అయితే ఈరోజు ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యంతో పాటుగా, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు, డాలర్ విలువ రూపాయితో పోలిస్తే పెరుగుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయని చెబుతున్నారు. కారణాలు ఏం చెప్పినా ధరలు మాత్రం పెరగడంతో పసిడిప్రియుల్లో ఆనందం ఆవిరి అయిపోయింది.
భారీగానే పెరుగుదల...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 330 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నేడు 57,700 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 77.200 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News