Gold Price Today : హమ్మయ్య బంగారం ధరలు తగ్గాయిగా....సీజన్ ప్రారంభానికి ముందు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది

Update: 2024-09-30 03:07 GMT

మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. శుభకార్యాలయాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. దాదాపు రెండు నెలల పాటు సీజన్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభానికి ముందు బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలు దారులకు ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిజానికి మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధరలు ఈరోజు మాత్రం స్వల్పంగానే తగ్గాయి. పెరిగినప్పుడు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ గురిచేసింది. బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీమాంసలో కొనుగోలుదారు పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పెళ్లిళ్ల ముహూర్తాలు ముందుగానే ఫిక్స్ కావడంతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి జ్యుయలరీ దుకాణాలకు వెళ్లిన వినియోగదారులు వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

ఎప్పుడూ డిమాండ్ తగ్గని...
పసిడికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కొనుగోలు చేస్తే అది ఎంతో కొంత లాభాన్ని తెచ్చి పెడుతుందేతప్ప నష్టం మాత్రం తేదు. అందుకే బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కవ మంది ఇష్టపడుతుంటారు. అది మనకు వైద్యసౌకర్యాల కోసం భరోసాగా ఉంటుందని భావిస్తారు. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి వస్తువులు దశాబ్దకాలంలో ధరలు పెరగడాన్ని చూస్తే దీన్ని బట్టి అర్థమవుతుంది. పదేళ్ల క్రితం బంగారాన్ని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు తమ గోల్డ్ అమ్మినా అనుకున్న మేరకు ఎక్కువగానే లాభాలు వస్తాయని భావిస్తుంటారు. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు సయితం బంగారం కొనుగోలును ఎక్కువగా ఇష్టపడేది అందుకే.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకూ నమోదయినవే. మధ్యాహ్నానికి పెరిగే అవకాశముంది. లేదంటే తగ్గుదల కూడా కనిపించ వచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 77,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News