Gold Price Today : రాఖీ పండగ రోజు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.
పసిడి ధరలు ఎప్పటికీ తగ్గవు. తగ్గవంటే తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుంటాయి. బంగారానికి ఉండే ప్రధాన లక్షణమదే. ఎందుకంటే బంగారం అంటేనే స్టేటస్ సింబల్ గా మారడం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి కొనుగోళ్లు పెరగడంతో పాటు డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు తగ్గి వస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకవేళ తగ్గినా స్వల్పంగా తగ్గుతాయి. పెరిగితే భారీగా పెరుగుదల ఉంటుంది. అయినా కొనుగోలుదారులు బంగారం ధరలకు అలవాటు పడిపోయారు. తమకు అవసరం ఉన్న సమయంలో మాత్రమే ఒకప్పుడు కొనుగోలు చేసే బంగారాన్ని నేడు అవసరమున్నా లేకపోయినా కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవడం వల్లనే ఈ పరిస్థిితి.
సులువుగా...
బంగారం అనేది పెట్టుబడిగా కూడా చూసే వారు అనేక మంది. దీనిని మార్చుకోవడం చాలా సులువు. ఎలాంటి పత్రాలు అవసరం లేదు. తమకు అవసరమైన సమయంలో విక్రయించుకుని క్యాష్ చేసుకునే వీలుంది. ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే తమకు కష్టకాలంలో పసిడి ఆదుకుంటుందన్న నమ్మకం జనాల్లో బాగా బలపడి పోయింది. అందుకే ఎక్కువ మంది భూమి మీద కంటే బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. బంగారం, వెండి ధరల పెరుగుదల కూడా అదే స్థాయిలో ఉండటంతో తాము కొనుగోలు చేసిన ధరకు ఎలాంటి నష్టం ఉండదన్న అభిప్రాయం మరింత బలపడి కొనుగోలు చేస్తుంటారు.
కొద్దిగా తగ్గి...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. రాఖీపండగ రోజు ధరలు తగ్గాయంటే అది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా నమోదయింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర 90,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.