Gold Rates Today : దీపావళికి ముందు మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు పెరగలేదోచ్
దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది.
బంగారం ధరలు అంటేనే గుండె దడ పడుతుంది. ఎంత పెరుగుతుందో చెప్పలేం. ప్రతి రోజూ ధరలను చూసి కొనుగోలుదారులు షాక్ అవ్వాల్సిందే. అంతగా పసిడి ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. ఇటీవల కాలంలో ధరలు పెరుగడం ప్రతిరోజూ జరుగుతుంది. బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు, చేర్పులుంటాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదల్లో కనిపిస్తున్న ప్రభావం బంగారంపైన పడుతుందని తెలసింది. అయితే గత నాలుగు రోజులుగా వరసగా పెరిగిన బంగారం ధరలు వరసగా రెండు రోజుల నుంచి కొంచెం శాంతిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు వరకూ తగ్గడం కొంత ఉపశమనం కల్గించే విషయమేనని చెప్పాలి.
ధన్ తెరాస్ ఉంది...
ఇక ముందు ధన్ తెరాస్ ఉంది. ఖచ్చితంగా ఆరోజు పసిడి కొనుగోలు చేయాలంటారు. అలాగే దీపావళికి కూడా బంగారం కొనుగోలు సంప్రదాయంలో ఒక భాగమై పోయింది. దీంతో బంగారానికి గిరాకీ మరింత పెరగనుంది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో కొనుగోళ్లు కూడా తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఇరవై నుంచి ముప్ఫయి శాతం కొనుగోళ్లుు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిందని చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం ధరల పెరుగుదల మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు.
స్థిరంగా కొనసాగుతూ...
ఇలాగే ట్రెండ్ కొనసాగితే తమ వ్యాపారాలను కొనసాగించడం కష్టమే అవుతుందని కార్పొరేట్ బంగారం దుకాణాలు చెబుతున్నాయి. తమకు షోరూం నిర్వహణ వయ్యం కూడా రాదని, సిబ్బంది జీతభత్యాలు కూడా అందనంతగా కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. దీంతో వినియోగదారులకు నేడు కొంత బంగారం కొనుగోలు చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,140 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,790 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,06,900 రూపాయలుగా నమోదయింది.