Gold Price Today : దీపావళికి ఇక బంగారం ధరలు ఆకాశంలో కనిపిస్తాయా? ధరలు చూస్తే?

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి

Update: 2024-10-24 03:47 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడం అనేది జరగడం లేదు. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. వెండి ధరలు కూడా అందుకు తగినట్లుగానే పరుగులు పెడుతున్నాయి. బంగారం ధరలు పది గ్రాముల ఎనభై వేల రూపాయలు దాటేశాయి. అలాగే వెండి ధరలు లక్ష పన్నెండు వేల రూపాయలకు చేరుకోవడం కూడా ధరలను అదుపు చేయడం కష్టమేమోనని పిస్తుంది. దీపావళి ఇంకా వారం రోజులు సమయం ఉంది. వారం రోజుల ముందే టపాసులు పేలినట్లు ధరలు పెరుగుతున్నాయి. థన్ తెరాస్ కూడా ఈ నెలలోనే ఉండటంతో ఇక ధరలు మన చేతికి అందవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడే కొనుగోలు చేస్తే?
బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే ఏడాదలో లక్ష రూపాయలు దాటే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే అవసరమైన వారు, బంగారంపై మదుపు చేయాలనుకున్న వారు ముందుగానే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. లక్ష దాటినా ఆశ్చర్యం లేదని, తర్వాత ధరలు దిగి రావడం కూడా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలకు అవసరమైన వాళ్లు ముందుగా కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని సూచనలు వెలువడుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇలా పరుగులు పెట్టడం చాలా రోజుల తర్వాత జరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు అదుపు లేకుండా...
బంగారం, వెండి రెండు కూడా ప్రతి ఇళ్లలో అవసరమైన వస్తువులుగా మారడంతో డిమాండ్ పెరగడంతో పాటు అనేక కారణాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వరసగా దీపావళి, కొత్త ఏడాది, సంక్రాంతి పండగలతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,990 రూపాయలుగా నమోదయింది. 24 కిలోల బంగారం ధర 79,630 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,12,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News