Gold Rates : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈరోజే ట్రై చేయండి
ఈరోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గా చెప్పాలి. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు పెరగకుండా ఉంటే సంతోషం. తగ్గితే అమితానందం. స్థిరంగా ఉంటే కూడా హ్యాపీ. పెరిగితేనే కొనుగోలు దారుల్లో ఆందోళన కనపడుతుంది. ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని వస్తువుగా బంగారం మారిపోయింది. ధర ఎంత ఉన్నా సరే కొనుగోలు చేయక తప్పదు. కుటుంబంలో జరిగే శుభకార్యాలు, పండగలు, పబ్బాలకు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని దక్షిణ భారతీయులు ఎక్కువ మంది అనుకుంటారు. అందుకే కొనుగోళ్లు ఎప్పుడూ తగ్గుముఖం పట్టవు.
ఆభరణాల కొనుగోలుకే...
నిత్యం జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడిపోతూనే ఉంటాయి. కొత్త డిజైన్లతో వచ్చిన వాటిని తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గోల్డ్ బాండ్స్ కొనుగోలు కంటే ఆభరణాల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే అలవాటు ఇంకా మనదేశంలో రాలేదు. ఎక్కువగా ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడ పసిడికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ధరలు పెరుగుతున్న పెద్దగా లెక్క చేయని పరిస్థితి ఉంది.
స్థిరంగా ధరలు...
ఈరోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గా చెప్పాలి. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిలకడగా కొనసాగుతున్నా రేపు ధరలు ఎంత పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈరోజు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,850 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,020 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 79,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.