GST Collection: డిసెంబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే....!?

GST Collection: డిసెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును అధిగమించినట్లు..

Update: 2024-01-02 01:30 GMT

GST collection

GST Collection: డిసెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన జీఎస్టీ వివరాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.97 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ శాతం 12% ఎక్కువ పన్ను వసూలు వచ్చాయి. దీంతో పాటు ఈ 9 నెలల్లో నెలవారీ సగటున 1.66 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అలాగే డిసెంబర్ నెలలో రూ.1,66,882 కోట్ల పన్ను ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో పన్ను వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి.

➦ డిసెంబర్ 2023లో మొత్తం పన్ను వసూళ్లు: రూ. 1,66,882 కోట్లు

➦ CGST: రూ. 30,443 కోట్లు

➦ SGST: రూ. 37,935 కోట్లు

➦ IGST: రూ. 84,255 కోట్లు

➦సెస్సు: రూ. 12,249 కోట్లు

కేంద్రం, రాష్ట్రాల మధ్య IGST పంపిణీ 

➦ CGST: రూ. 40,057 కోట్లు

➦ SGST: రూ. 33,652 కోట్లు

డిసెంబర్ నెలలో అత్యధిక GST వసూళ్లు ఉన్న రాష్ట్రాలు:

జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రూ.8,000 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశాయి.

➦ మహారాష్ట్ర: రూ.26,814 కోట్లు

➦ కర్ణాటక: రూ.11,759 కోట్లు

➦ తమిళనాడు: రూ.9,888 కోట్లు

➦ గుజరాత్: రూ.9,874 కోట్లు

➦ హర్యానా: రూ. 8,130 కోట్లు

➦ ఉత్తరప్రదేశ్: రూ. 8,011 కోట్లు

➦ ఢిల్లీ: రూ.5,121 కోట్లు

➦ పశ్చిమ బెంగాల్: రూ. 5,019 కోట్లు

➦ తెలంగాణ: రూ.4,753 కోట్లు

➦ ఒడిశా: రూ.4,351 కోట్లు

Tags:    

Similar News