డబ్బులు చెల్లించకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని సిరీస్‌లను చూడొచ్చు.. ఎలాగంటే..

ఈ రోజుల్లో ఓటీటీ ట్రెండ్‌ కొనసాగుతోంది. మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకున్న చాలా మంది ఓటీటీల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్..

Update: 2024-03-24 02:00 GMT

Netflix

ఈ రోజుల్లో ఓటీటీ ట్రెండ్‌ కొనసాగుతోంది. మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకున్న చాలా మంది ఓటీటీల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు. అయితే నెలనెల, లేదా మూడు నెలలకోసారరి ఫోన్ రీఛార్జ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. మళ్లీ OTT ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ వేరుగా ఉంటుంది. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌లు, షోలు, సినిమాలను చూడగలిగితే ఎంత బాగుంటుంది.. ఇది సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి మీరు నెట్‌ఫ్లిక్స్‌లోని మొత్తం కంటెంట్‌ను మళ్లీ ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా చూడగలిగే రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చౌకైన ప్లాన్‌

రిలయన్స్ జియో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉంది. మీరు కేవలం ఒక రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంది. కానీ నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1099. ఇది మీకు 84 రోజుల చెల్లుబాటును ఇస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్‌లో మీరు రోజుకు 2 GB డేటా పొందుతారు. ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.

ఏ ప్రయోజనాలను పొందొచ్చు

ఈ జియో రీఛార్జ్‌తో 84 రోజులతో పాటు Netflix సభ్యత్వాన్ని పొందవచ్చు. దీనిలో మీరు మీ మొబైల్, టాబ్లెట్‌లోని యాప్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌లు, షోలు, చలనచిత్రాలను ఉచితంగా చూడవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు యాక్సెస్‌ను మాత్రమే కాకుండా JioTV, JioCinema, JioCloud వంటి Jio యాప్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. విడివిడిగా మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయడం వల్ల ఇకపై ఇబ్బంది ఉండదు.

Tags:    

Similar News