గుడ్‌న్యూస్‌.. కొత్తగా యూపీఐ ఏటీఎంలు.. కార్డు లేకపోయినా డబ్బులు..

బ్యాంకు వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ వచ్చింది. ఏటీఎంల విషయంలో కొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది..

Update: 2023-09-07 05:36 GMT

బ్యాంకు వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ వచ్చింది. ఏటీఎంల విషయంలో కొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. ఇక యూపీఐ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా డెబిట్ కార్డు లేకపోయినా, డెబిట్ కార్డు పిన్ మర్చిపోయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సులభంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ తాజాగా యూపీఐ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వైట్ లేబుల్ ఏటీఎం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేటష్ ఆప్ ఇండియా (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో ఈ సర్వీసులు విడుదల చేసింది. దీన్ని హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం అని కూడా పిలుస్తారు.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి యూపీఐ ద్వారా సులభంగానే డబ్బులు తీసుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను విడుదల చేశారు. అయితే రానున్న రోజుల్లో ఈ ఏటీఎంలు అన్ని ప్రాంతాల్లో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటీఎం కార్డులు లేకుండానే మీరు యూపీఐ సహాయంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకు అకౌంట్‌ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు:

కాగా, డెబిట్‌ కార్డు లేకున్నా.. ఒక వేళ కార్డు ఉండి పిన్‌ నెంబర్‌ మర్చిపోయినా మీ బ్యాంకు అకౌంట్‌ నుంచి నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఏటీఎం ఎలా పని చేస్తుంది? అనే ప్రశ్న చాలా మందిలో రావచ్చు. ఈ విషయాన్ని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో క్యాష్ బిజినెస్ సునిల్ వికాంసే వెల్లడించారు. ఇందులో డబ్బులు వేగంగా విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ముందుగా మీరు ఎంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయెల్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంత డబ్బు విత్‌డ్రా చేసున్నారో ఎంటర్ చేయాలి. క్యూఆర్ కోడ్ స్కానర్‌ ఆప్షన్ ఎంచుకోవాలని ఆయన అన్నారు.
తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ట్రాన్సాక్షన్ పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.

కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని ఎలా తొలగిస్తారు?

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఏటీఎం వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని భౌతికంగా ఉపయోగించకుండా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాన్ని తొలగించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.కార్డ్ స్కిమ్మింగ్ అనేది కస్టమర్‌లు తమ కార్డ్‌లను ఇన్‌సర్ట్ చేసినప్పుడు కార్డ్ నంబర్‌లు, పిన్‌లతో సహా కార్డ్ సమాచారాన్ని పొందడానికి ఏటీఎంలు లేదా పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో పరికరాలను అమర్చే ఒక రకమైన మోసం. మోసగాళ్ల టెక్నాలజీని ఉపయోగించుకుని రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా ఎలాంటి మోసం అనేది ఉండదు. మోసాలను నివారించేందుకు ఇలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Tags:    

Similar News