వాట్సాప్‌లో AI స్టిక్కర్‌లను సృష్టించడం, పంపడం ఎలా?

వాట్సాప్‌.. దీని గురించి తెలియనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిందే. చిన్నారుల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌..

Update: 2023-10-17 02:23 GMT

వాట్సాప్‌.. దీని గురించి తెలియనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిందే. చిన్నారుల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ ఉపయోగించని వారుండరు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే ఈ రోజుల్లో వాట్సాప్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇప్పుడు మరో ఫీచర్‌ కూడా ఉంది. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ Meta ఇటీవల తన అన్ని సోషల్ మీడియా యాప్‌ల కోసం AI ఫీచర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ ఫీచర్ సహాయంతో మీరు వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టిక్కర్‌లను సృష్టించవచ్చు.. పంపవచ్చు కూడా. ఆ తర్వాత వాట్సాప్‌లో సంభాషణ శైలి మారుతుంది.

అలాగే మీరు ఏ సందేశానికైనా మునుపటి కంటే మెరుగైన రీతిలో రిప్లై ఇవ్వవచ్చు. వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం ఈ AI స్టిక్కర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మీరు మీ స్వంత స్టిక్కర్‌లను సృష్టించ్చి మీ వాట్సాప్‌ సహాయంతో వాటిని మీ వాట్సాప్‌ మిత్రులకు పంపవచ్చు. వాట్సాప్‌ ఈ ఫీచర్‌లో Meta AI ఫీచర్ ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఎవరికైనా AI స్టిక్కర్‌ని పంపిన తర్వాత మీ AI స్టిక్కర్ వాట్సాప్ స్టిక్కర్ ట్రేలో స్వయంచాలకంగా కనిపిస్తుంది. అలాగే మీరు దాన్ని మళ్లీ మరొకరికి పంపవచ్చు.

అయితే దాదాపు 180 దేశాల్లో ఉపయోగించబడుతుంది. వాట్సాప్‌ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్లాట్‌ఫారమ్ ప్రతిరోజూ కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇటీవల ప్లాట్‌ఫారమ్ దీనికి AI జనరేట్ స్టిక్కర్ ఫీచర్‌ను కూడా జోడించింది. వాట్సాప్‌ ఏఐ స్టిక్కర్లు ఆంగ్ల భాషను మాత్రమే సపోర్ట్ చేస్తాయని గుర్తించుకోండి. ప్రస్తుతం వాట్సాప్‌ కొన్ని దేశాలలో మాత్రమే AI స్టిక్కర్లను విడుదల చేసింది. మీరు వాట్సాప్‌లో AI స్టిక్కర్‌ని మీ పరిచయస్తులకు పంపాలనుకుంటే, వాటిని ఎలా సృష్టించాలో తెలుసుకోండి.

వాట్సాప్‌ AI స్టిక్కర్లను ఎలా సృష్టించాలి?

☛ మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsAppను ఓపెన్‌ చేయండి

☛ ఆ తర్వాత వాట్సాప్‌ చాట్‌ను తెరవండి

☛ ఆ తర్వాత స్మైలీ ఐకాన్‌తో పాటు స్టిక్కర్ చిహ్నంపై క్లిక్‌ చేయండి

☛ ఇప్పుడు క్రియేట్‌ చేయడం అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. అలాగే ప్రాంప్ట్ చేయబడితే, కొనసాగించుపై క్లిక్‌ చేయండి.

☛ దీని తర్వాత మీరు సృష్టించాలనుకుంటున్న స్టిక్కర్ల వివరాలను నమోదు చేయాలి

☛ యాప్‌ తర్వాత 4 స్టిక్కర్‌లను సృష్టిస్తుంది. ఇప్పుడు మీరు మీకు నచ్చిన స్టిక్కర్‌ను ఎంచుకోవచ్చు లేదా ఏవైనా మార్పులు చేయడానికి వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది.

☛ మీకు స్టిక్కర్ నచ్చితే పంపేందుకు ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.


Tags:    

Similar News