UPI ATMను ఉపయోగించి విత్‌డ్రా చేయడం ఎలా?

దేశంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకునేవారు. ఇప్పుడు..

Update: 2023-09-14 06:50 GMT

దేశంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకునేవారు. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఇంట్లోనే ఉండి స్మార్ట్‌ ఫోన్‌ల ద్వారా లావాదేవీలు చేసుకుంటున్నాము. ఇక డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎంకు వెళ్లి చేసుకుంటాము. ఇక ఏదైనా బయటకు పని నిమిత్తం వెళ్లిప్పుడు డబ్బులు కావాలంటే ఏటీఎంకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో దగ్గర డెబిట్‌ కార్డు లేకుంటే ఎలా ఉంటుంది. మళ్లీ ఇంటికి వెళ్లి ఏటీఎం కార్డును తెచ్చుకోవాల్సి పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే సరిపోతుంది. ఏటీఎం కార్డు జేబులో లేకున్నా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం వచ్చేసింది. దేశంలో సాంకేతిక కారణంగా డిజిటల్ చెల్లింపు లావాదేవీల విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మీ చేతిలోని ఫోన్ సహాయంతో UPI చెల్లింపు చేయడం ద్వారా క్రయవిక్రయాలు సులభతరం అవుతుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఏటీంలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో యూపీఐ ఏటీఎంలు ఏర్పాటు కానున్నాయి. తాజాగా UPI ATM అందుబాటులోకి రావడంతో డెబిట్‌ కార్డు లేకుండా కూడా నగదు తీసుకోవచ్చు. ఐతే దీనిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. మరి యూపీఐ ఏటీఎంను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

☛ ముందుగా మీరు ఏదైనా UPI ATMకి వెళ్లాలి.
☛ అక్కడ కార్డ్ లెస్ లావాదేవీపై క్లిక్ చేయాలి.
☛ తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై డబ్బు డ్రా చేసే అప్షన్లు కనిపిస్తాయి

☛ అందులో మీరు ఎంత డబ్బు తీసుకుంటారో ఆ మొత్తాన్ని ఎంచుకోవాలి

☛ తర్వాత స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది. దాన్ని మీ ఫోన్‌తో స్కాన్ చేయాల్సి ఉంటుంది.

☛ స్కాన్ చేయడానికి మీ ఫోన్‌లో ఉన్న ఏదైనా UPI యాప్‌ని తెరిచి QR కోడ్‌ని స్కాన్ చేయాల్సి ఉంటుంది

☛ మీరు అనేక యూపీఐ ఖాతాలు ఉపయోగిస్తుంటే ఇక్కడ ఏ ఖాతాను ఎంచుకోవాలో కూడా ఆప్షన్లు వస్తాయి.

☛ ఖాతాను ఎంచుకున్న తర్వాత యూపీఐ పిన్‌ను నమోదు చేస్తే సరిపోతుంది.

☛ ఏటీఎమ్‌ నుంచి కార్డు లేకుండానే డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

☛ విత్‌ డ్రా తర్వాత మీ ఫోన్‌కు లావాదేవీకి సంబంధించిన మెసేజ్‌ కూడా వస్తుంది.

Tags:    

Similar News