రైల్లోంచి మీ స్మార్ట్‌ ఫోన్‌ పడిపోయిందా? ఇలా చేస్తే సేఫ్‌గా మీ ఇంటికొస్తుంది!

చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే బస్సు ఛార్జీల కంటే రైలు ఛార్జీలు చాలా తక్కువ ఉండటమే.

Update: 2023-11-11 15:15 GMT

చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే బస్సు ఛార్జీల కంటే రైలు ఛార్జీలు చాలా తక్కువ ఉండటమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం కూడా చాలా పెరిగిపోయింది. ప్రయాణంలో చాలా మంది ఎక్కువ చేసే పని ఏంటంటే.. సెల్ఫీలు దిగడం, రైలు పరుగెడుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం చేయడం చాలా మందికి ఉండే అలవాటే. అయితే రైలు ఎక్కారంటే చాలు సుందరమైన దృశ్యాలు, సెల్ఫీలతో ఫోటోలు, వీడియోలను వారివారి స్మార్ట్‌ ఫోన్‌లలో బంధిస్తుంటారు.

అయితే కానీ కొన్ని సందర్భాల్లో పొపాటున మీ ఫోన్‌ కింద పడిపోతుంటుంది. అలాంటి సమయంలో వారిలో ఉండే టెన్షన్‌ ఇంతా ఇంతా కాదు. చేసేదేమి లేక అలాగే ఉండిపోతుంటారు. సెల్ఫీల మోజు ఫోన్‌ పోగొట్టుకునే పరిస్థితి వరకు వస్తుంటుంది. అందుకే రైలు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక రైల్లోంచి ఫోన్‌ జారిపడిపోయిందంటే చాలు అంది దొరకదనే భావనలో ఉండిపోతుంటారు. ఇక ఖరీదైన ఫోన్‌ ఉంటే కనుక చైన్‌ లాగేందుకు కూడా ప్రయాణిస్తుంటారు. ఇలా చేసినా మీపై జరిమానా, కేసు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మేము ఇక్కడ చెప్పే అంశాలను పాటిస్తే పడిపోయిన మీ ఫోన్‌ జాగ్రత్తగా మీ ఇంటికొస్తుంది.

ఫోన్‌ పడిపోతే ఏం చేయాలి...?

మీ ఫోన్‌ ఫోన్‌ పడిపోగానే వెంటనే పడిపోయిన ప్రాంతంలో ఓ స్తంబం ఉంటుంది. దానిపై కొన్ని అంకెలు ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. ఆ తర్వాత రైలులో ఉన్న ఇతరుల నుంచి ఫోన్‌ తీసుకుని ఫోన్‌లో మీరు వెళ్తున్న రైలు ఏ ప్రాంతంలో ఉందో రైల్వే యాప్‌ ద్వారా ట్రాక్‌ చేయండి. ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించుకుని 139 నంబర్‌కు డయల్‌ చేయండి. ఆ కాల్‌ రైల్వే హెల్ఫ్‌లైన్‌ సెంటర్‌కు వెళ్తుంది. సిబ్బందికి ఫోన్‌ పడిపోయిన ప్రాంతంలో కొంత అటు ఇటుగా ట్రాక్‌ పక్కనే ఉన్న స్తంభంపై ఉన్న మూడంకెల నంబర్‌ను సిబ్బందికి తెలియజేయండి. అలాగే మీరు మీరు వెళ్తున్న రైలు ఎక్కడుందో ట్రాక్‌ చేసిన ప్రాంతాన్ని తెలియజేయండి. అలాగే మీ అడ్రస్‌ కూడా చెప్పాల్సి ఉంటుంది.

ఈ ఫోన్‌ కాల్‌ ముగిసిన వెంటనే రైల్వే హెల్ఫ్‌లైన్‌ సిబ్బంది ఫోన్‌ పడిపోయిన ప్రాంతం సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందిస్తారు. సిబ్బంది మీ ఫోన్‌ను వెతికేందుకు ఆ ప్రాంతానికి వెళ్తారు. మీరు చెప్పిన స్తంభం నంబర్‌ ఆధారంగా అక్కడికి చేరుకుని మీ ఫోన్‌ను గుర్తిస్తారు. అది కూడా ఈ గ్యాస్‌లో మీ ఫోన్‌ను ఎవ్వరు తీసుకోకుంటే కనుక మీ ఫోన్‌ను గుర్తించి మీరు చెప్పిన చిరునామాకు కొరియర్‌ చేస్తారు.

Tags:    

Similar News