రైలు బోగీలపై ఈ గీతలు గమనించారా? వాటి అర్థం ఏంటో తెలుసా!
చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఎందుకంటే..
చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఎందుకంటే ఛార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంటుంది రైల్వే. అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. మన కంటికి ఎన్నో కనిపించినా వాటిని పెద్దగా పట్టించుకోము. రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. ఆ గీతలను మీరెప్పుడైనా గమనించారా..? చదువు రానివారు కూడా కోచ్‌ల గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి. అయితే ఈ బోగీలపై గీసిన గీతల అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి భోగీ పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి. ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయి (బోరి బందర్), థానే మధ్య నడిచిందని రైల్వే వివరాలు చెబుతున్నాయి.
☛ నీలి రంగు లో పసుపు గీతలు ఉంటే: రైలు బోగీపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన బోగీ అని అర్థం. అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన బోగీ.
☛ బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే: రైలు బోగీపై బుడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఈ బోగీలో ప్రయాణించవచ్చు.
☛ ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే: రైలు బోగీపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది.
☛ బోగీ పై తెల్లని గీతలు ఉంటే: నీలి రంగు డబ్బా బోగీపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్ క్లాస్ కోచ్ అని అర్థం.