రైలు పట్టాల మధ్యలో కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా..?
ఇండియన్ రైల్వే భారతదేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. రైల్వే గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్న తక్కువే. రైలు పరుగులు..
ఇండియన్ రైల్వే భారతదేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. రైల్వే గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్న తక్కువే. రైలు పరుగులు పెట్టడానికి కీలక పాత్ర పోషించేవి రైలు పట్టాలు. రైల్వే విషయంలో ఎన్నో విషయాలు మనకు తెలియనివి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు రైలు పట్టాల గురించి తెలుసుకుందాం. రైలు పట్టాలను మీరు ఎప్పుడైన గమనించారా? రైలు పట్టాల మధ్య కానీ, పట్టాల చుట్టు పక్కల కంకర రాళ్లను వేసిన దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ అవి ఎందుకు వేశారో అనే విషయం చాలా మందికి తెలియదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోం కూడా. మరీ కంకర రాళ్లను ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. రైలు పట్టాలు వేసే ముందు ప్రత్యేక దిమ్మెలను భూమిపై పర్చి వాటిపై రైలు పట్టాలను అమర్చుతారు. అయితే గతంలో చెక్కతో చేసిన దిమ్మెలు ఏర్పాటు చేసేవారు.
ఇప్పుడు ప్రత్యేక కాంక్రిట్‌తో తయారు చేసిన దిమ్మెలను వేస్తున్నారు. తర్వాత పట్టాల మధ్యలో, చుట్టుపక్కల కంకర రాళ్లను వేస్తారు. కంకర రాళ్ల వల్ల పట్టాల కింద ఉండే దిమ్మెలు కదలకుండా ఉంటాయి. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు కంకర రాళ్ల వల్ల పట్టాలు ఎటు కదలకుండా దిమ్మెలు ఫిక్సై ఉంటాయి. రైలు వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉండదు. అలాగే వర్షం పడినప్పుడు కంకర ఉండటం వల్ల నీరు సులభంగా భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉంటుంది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అటంకం ఏర్పడదు. వర్షం వచ్చినా కంకర ఉండటం వల్ల ట్రాక్ కొట్టుకుపోకుండా ఉంటుంది.