మీ ఎల్‌ఐసీ పాలసీ లాప్స్‌ అయ్యిందా? మీకో గుడ్‌న్యూస్‌

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వినియోగదారుల కోసం ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే కొన్ని..

Update: 2023-10-06 04:49 GMT

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వినియోగదారుల కోసం ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పాలసీలు తీసుకున్న వారు మధ్యలోని నిలిపివేస్తారు. అలాంటి సమయంలో పాలసీ రద్దు కావడం, గడువు ముగిసిపోవడం వంటి కారణాల వల్ల పాలసీ రద్దు అవుతుంటాయి. అలాంటి వారికి ఎల్‌ఐసీ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. రద్దు అయిన పాలసీలను పునరుద్ధరించడానికి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారం సెప్టెంబర్ 1న ప్రారంభించగా, లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి 31 అక్టోబర్, 2023 వరకు గడువు ఉంది. లాప్స్‌ అయిన వారు ఎల్‌ఐసీ బ్రాంచ్/ఏజెంట్‌ని సంప్రదించవచ్చు. అలాగే మీ పాలసీని స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ కింద 31 అక్టోబర్‌ 2023లోపు పునరుద్ధరించుకోవాలని ఎల్‌ఐసీ కోరుతోంది.

బీమా పాలసీలు ఎలాంటి సమయాల్లో లాప్స్ అవుతాయి?

పాలసీదారులు గడువు తేదీలోపు ప్రీమియంలను చెల్లించేలా చూసుకోవడం చాలా ముఖ్యం. వారికి 15, 30 రోజుల మధ్య గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా వ్యక్తులు ప్రీమియంలు చెల్లించడంలో విఫలమైనప్పుడు మాత్రమే పాలసీ లాప్స్ అవుతుంది. సోషల్ మీడియా X లో పోస్ట్ ప్రకారం.. ఎల్‌ఐసీ ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారం – పాలసీదారులు తమ ల్యాప్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి ఒక అవకాశం ఉందని, మరింత తెలుసుకోవడానికి మీ సమీప ఎల్‌ఐసీ బ్రాంచ్ లేదా ఏజెంట్‌ని సంప్రదించండి లేదా https://licindia.inని సందర్శించండి అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది ఎల్‌ఐసీ సంస్థ. ఆలస్య రుసుము ఛార్జీలలో రాయితీ మూడు భాగాలుగా విభజించబడింది.

పాలసీ పునరుద్ధరణపై ఎల్‌ఐసీ అందించే రాయితీలు:

➦ రూ.1 లక్ష పరిధిలో మొత్తం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు కోసం ఆలస్య రుసుము ఛార్జీలలో 30 శాతం రాయితీ. అనుమతించింది సంస్థ. లేదా గరిష్టంగా రూ.3,000 రాయితీకి అర్హులు.

➦ రూ. 1 లక్ష నుంచి రూ.3 లక్షల పరిధిలో ఉన్న మొత్తం ప్రీమియం చెల్లింపు కోసం ఆలస్య రుసుము ఛార్జీలకు 30 శాతం రాయితీ, లేదా గరిష్టంగా రూ. 3,500 రాయితీకి అర్హులు.

➦ మొత్తం ప్రీమియం చెల్లింపు రూ.3 లక్షల పరిధిని మించి ఉంటే ఆలస్య రుసుము ఛార్జీలకు రాయితీ 30 శాతం లేదా గరిష్ట రాయితీ రూ. 4000.

ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్ అయిందా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి?

➦ ముందుగా పాలసీదారులు ఎల్‌ఐసీ పోర్టల్‌కి వెళ్లాలి.

➦ ‘రిజిస్టర్డ్ యూజర్’పై క్లిక్ చేయండి.

➦ అవసరమైన వివరాలతో ఎల్‌ఐసీ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.

➦ లాగిన్ అయిన తర్వాత, ‘పాలసీ స్టేటస్‌’పై క్లిక్ చేయండి.

➦ దీని కింద పాలసీదారులు చెల్లించాల్సిన ప్రీమియం తేదీ, స్థితి, ల్యాప్స్ అయిన పాలసీని తనిఖీ చేయవచ్చు.



Tags:    

Similar News