ముఖేష్‌ అంబానీ భద్రత వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా?

దేశంలోనే అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే..

Update: 2023-10-29 02:47 GMT

దేశంలోనే అత్యంత సంపన్నుడు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అంబానీని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్‌ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితమే ముఖేష్ అంబానీకి ఈ తరహా బెదిరింపు రాగా, తాజాగా మరోసారి బెదిరింపు రావడం కలకలం రేపుతోంది.

అంబానీ భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది?

ముఖేష్ అంబానీ భద్రతా వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. చీమ కూడా దూరేందుకు అవకాశం లేని విధంగా భద్రత వ్యవస్థ ఉంటుంది. అంబానీ సెక్యూరిటీ వ్యవస్థలో50 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఉంటారు. వీరు 24 గంటలు మోహరించి ఉంటారు. అంతేకాదు.. కమాండోలు అనేక అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటారు. వీటిలో జర్మన్ తయారు చేసిన హెక్లర్, కోచ్ MP5 సబ్ మెషిన్ గన్‌లు ఉన్నాయి. ఈ తుపాకీ ఒక్క నిమిషంలో 800 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంటుంది. ముఖేష్ అంబానీకి 6 రౌండ్ ది క్లాక్ ట్రైనింగ్ డ్రైవర్లు కూడా ఉన్నారు.

వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు :

వీరే కాకుండా అంబానీకి దాదాపు 15 నుండి 20 మంది వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారి వద్ద ఆయుధాలు ఏమి ఉండవు. ఈ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులకు ఇజ్రాయెలీ సెక్యూరిటీ కంపెనీ శిక్షణ ఇచ్చింది. ఈ సెక్యూరిటీ గార్డులలో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది కూడా ఉన్నారు.

నీతా అంబానీకి వై ప్లస్ సెక్యూరిటీ స్కీమ్:

2013లో ముఖేష్ అంబానీకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఆ సమయంలో సదరు వ్యాపారికి హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి బెదిరింపులు రావడంతో ఈ సెక్యూరిటీ వ్యవస్థను కల్పించింది అప్పటి ప్రభుత్వం. ఇది కాకుండా, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 2016 సంవత్సరంలో వై ప్లస్ భద్రత కల్పించారు. ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ సెక్యూరిటీని ఇచ్చింది. ఇది కాకుండా 8 నెలల క్రితం కూడా, ముఖేష్ అంబానీ, అతని కుటుంబానికి భారతదేశం, విదేశాలలో కూడా Z ప్లస్ స్థాయి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఖర్చును అంబానీ కుటుంబమే భరిస్తుంది. అంతకుముందు ఈ ఖర్చును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భరించింది. Z ప్లస్‌ సెక్యూరిటీ ఖర్చు నెలకు 40 నుండి 45 లక్షల రూపాయలు అని తెలుస్తోంది. అయితే తాజాగా ముఖేష్‌ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టిస్తోంది. 

Tags:    

Similar News