BYD Atto 3: తక్కువ ధరల్లోనే లగ్జిరి ఈవీ కారు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 521కి.మీ

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ భారతీయ మార్కెట్లో మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కంపనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు

Update: 2024-07-11 07:33 GMT

BYD Atto 3

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ భారతీయ మార్కెట్లో మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కంపనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు మన దేశ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్త కారును బీవైడీ విడుదల చేసింది. 2024 అట్టో 3 ఈవీ పేరుతో తీసుకొచ్చింది. ఇది మూడు కొత్త వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ లైనప్ లో డైనమిక్, ప్రీమియం, సూపీరియర్ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర డైనమిక్ వేరియంట్ రూ. 24.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉండగా.. గరిష్టంగా సూపీరియర్ వేరియంట్ ధర రూ. 33.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉందని కంపెనీ వివరాల ద్వారా తెలుస్తోంది.

అలాగే విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ బుకింగ్‌లను రూ. 50,000టోకెన్‌ చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఎంట్రీ లెవల్ డైనమిక్ ట్రిమ్‌లో 49.92 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 468 కిమీ పరిధిని అందిస్తుంది. ప్రీమియం, సుపీరియర్ రెండు వేరియంట్‌లు సింగిల్ ఛార్జ్‌పై 521 కి.మీ మైలేజీ అందించనుంది. ఇది పెద్ద 60.48కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్‌లను పొందుతాయి. దీనిలో బ్యాటరీ డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 50 నిమిషాల్లో 0-80% వరకూ ఛార్జ్ అవుతుందని తెలుస్తోంది.. డైనమిక్ ట్రిమ్ 70కేడబ్ల్యూహెచ్ డీసీ ఛార్జింగ్ ఆప్షన్‌ కూడా అందించింది. డైనమిక్ ట్రిమ్‌ కేవలం 7.9 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

Tags:    

Similar News