Nita Ambani: రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!

దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం, ప్రపంచంలో సంపన్నుల జాబితాలో ఆయన 11వ స్థానంలో ఉన్నారు. అదే ముఖేష్‌ అంబానీ..

Update: 2024-07-15 13:18 GMT

Nita Ambani

దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం, ప్రపంచంలో సంపన్నుల జాబితాలో ఆయన 11వ స్థానంలో ఉన్నారు. అదే ముఖేష్‌ అంబానీ. అంబానీ చిన్న కుమారుడైన అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12వ తేదీన అంగరంగ వైభవంగా ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచమే అవక్కయ్యే విధంగా కుమారుని వివాహం జరిగింది. ప్రపంచంలో ఉన్న ధనికులు, ప్రముఖులు, దేశాదినేతలు, సెలబ్రెటీలు ఇలా ఎంతో మంది పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లితో ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ కిటకిటలాడింది. అంతేకాకుండా పెళ్లికి ముందు 50 మంది నిరుపేదల పెళ్లిళ్లు చేసి..సంవత్సరానికి సరిపడ సామాగ్రిని అందించారు. అలాగే బంగారు అభరణాలు,ఇతర వస్తువులు కూడా అందించారు.

అయితే ఈ పెళ్లి వేడుకలను అంబానీ భార్య అయిన నీతా అంబానీ అన్నీ తానై చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీకి చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పెళ్లి వేడుకల్లో చివరి రోజు మంగళ ఉత్సవ్‌ కార్యక్రమంలో నీతా అంబానీ మీడియాకు హృదయ పూర్వ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఆమె రెండు చేతులు జోడించి మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అనంత్ – రాధిక పెళ్లి సమయంలో ఎంతో మద్దతు ఇచ్చినందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తమ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కూడా కోరారు. పెళ్లి అన్నాక కొన్ని కొన్ని తప్పులు జరుగుతుండటం సాధారణమేనని, వాటన్నింటిని కూడా మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. ఇలా అపర కుబేరుడి భార్య అయి ఉండి ఆమె ఇలా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.


Tags:    

Similar News