నీతా అంబానీ రాజీనామాకు ఆమోదం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కంపెనీ బోర్డు నుండి తప్పుకున్నారు

Update: 2023-08-29 01:51 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కంపెనీ బోర్డు నుండి తప్పుకున్నారు. ఇప్పటి వరకు ఆమె బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. వారి పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు బోర్డులోకి వస్తుండటంతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంస్థ‌లో ఈ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌నున్నారు. 46వ వార్షిక సాధారణ స‌మావేశాలలో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. ఈ నియామ‌కంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లను కోరారు. షేర్ హోల్డ‌ర్ల నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది. కొన్నేళ్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ ముగ్గురు వ్యాపారాలను చూసుకుంటున్నారు. రిటైల్, డిజిట‌ల్ స‌ర్వీసులు వంటి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిల‌య‌న్స్ అనుబంధ‌ కంపెనీల బోర్డుల్లోనూ వీరు ఉన్నారు. ఇప్పుడు వీరు బోర్డులోకి వస్తున్న నేపథ్యంలో నీతా రాజీనామాను డైరెక్ట‌ర్లు అంగీక‌రించారు. అయితే అన్ని బోర్డు మీటింగ్‌ల‌కు ఆమె ఓ పర్మనెంట్ ఇన్వైటీగా హాజరవుతారు.

జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తెలిపారు. సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్ వెల్లడించారు. ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందన్నారు. దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు తెలిపారు. సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందని తెలిపారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామన్నారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని, డిసెంబర్ నాటికి అందిస్తామన్నారు.


Tags:    

Similar News