మీ ఇంట్లో వాడే నూనె కల్తీదా..? మంచిదా..? తెలుసుకోవడం ఎలా?
మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోగా, ఇప్పుడు ధరలు దిగి వచ్చాయి..
మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోగా, ఇప్పుడు ధరలు దిగి వచ్చాయి. లీటర్ వంటనూనె ప్యాకెట్ దాదాపు రూ.120 నుంచి రూ.150లోపే ఉంది. ధర ఎంత ఉన్నా.. కొనడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే నూనె లేనిదే వంటలు చేయలేము. ఒక వైపు ధరలు మండిపోతుంటే.. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతున్నాయి. నకిలీ వంట నూనెలు అమ్ముతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మోసగాళ్లు. అవసరాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు కల్తీ నూనెలు తయారు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. కల్తీకి ఎంత చెక్ పెట్టినా.. ఏదో విధంగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు దరి చేరుతున్నాయి. ఇలాంటి కల్తీ నూనె వల్ల ఎన్నో రోగాలు చుట్టుముట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నూనె కల్తీ ఉందా..? లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మన ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్ వల్ల వంటల్లో నూనె కల్తీదా..? మంచిదా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) ఓ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కల్తీని గుర్తించడం ఎలా..?