‘ఓలా’ నుంచి మరో మూడు కొత్త స్కూటర్లు.. ధర ఎంతంటే..
ప్రస్తుతం పెట్రోల్ డిజీల్ ధరలు పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు వాహనదారులు. వినియోగదారులను..
ప్రస్తుతం పెట్రోల్ డిజీల్ ధరలు పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు వాహనదారులు. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కొత్త కొత్త ఫీఛర్స్ ను జోడిస్తూ ఈవీ స్కూటర్లు, కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముందుగా ఓలా నుంచి అద్భుతమైన స్కూటర్లు అందుబాటులోకి రాగా, క్షణాల్లోనే వేలాదిగా వాహనాలు బుకింగ్ కావడం అయిపోయాయి. ఇక ఆ తర్వాత వివిధ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇంకా మరిన్ని వాహనాలు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ‘ఓలా’ నుంచి ఇప్పటికే భారత్ లో అనేక స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో మూడు స్కూటర్లను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆగస్టు 15న సందర్భంగా ‘కస్టమర్ డే’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో వీటిని విడుదల చేసింది ఓలా కంపెనీ. ఈ స్కూటర్లను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువస్తోంది.
మూడు వేరియంట్ల పేరేమిటి?
ఓలా ఎస్ 1 ఎక్స్ (ola S1X) పేరిట ఈ మూడు వేరియంట్లను తీసుకువచ్చింది ఓలా.
1. ఎస్1 ఎక్స్ (ola S1X) (2kWh)
2. ఎస్1 ఎక్స్ (ola S1X) (3kWh)
3. ఎస్ 1 ఎక్స్+ (ola S1 X+)
ఈ మూడు మోడళ్లను కూడా లక్ష రూపాయలలోపు తీసుకువచ్చింది. దీంతో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎస్ 1 ప్రో సెకండ్ జనరేషన్‌ను కూడా ఆవిష్కరించింది. వీటితోపాటు మూవ్ ఓఎస్ 4ను కూడా విడుదల చేసింది. దీని బీటా వెర్షన్ వచ్చే నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు.
ఈ స్కూటర్లు రెండు మోడళ్లలో ఉన్నాయి. ఓలా ఎక్స్ 1+ స్కూటర్ ధర రూ.1.09 లక్షలు ఉండగా, ప్రారంభ ఆఫర్ లో భాగంగా రూ.99,999కే ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. ఆగస్టు 21 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇక ఓలా ఎస్ 1ఎక్స్ (3kWh) స్కూటర్ రూ.99,999 ఉండగా, దీనిని ఆగస్టు 21 వరకు 10 వేల రూపాయల తగ్గింపులో లభించనుంది. ఎస్ 1 ఎక్స్ 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన మోడల్ రూ.89,999 ధర ఉండగా, ఆగస్టు 21 వరకు 10 వేల తగ్గింపుతో రూ.79,999లకే విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఎస్1 ప్రో సెకండ్ జనరేషన్ వేరియంట్ ధర రూ.1.47 లక్షలు ఉండగా, ఎస్ 1 ఎయిర్ రూ.1.19 లక్షలుగా నిర్ణయించినట్లు సీఈవో వెల్లడంచారు.