Gold rates : పండగ పూట ఊరట

దసరా పండగ రోజు పసిడి ధరలు శాంతించాయి. వినియోగదారులకు కొంత ఊరట కలిగించాయి

Update: 2023-10-23 03:16 GMT

దసరా పండగ రోజు పసిడి ధరలు శాంతించాయి. వినియోగదారులకు కొంత ఊరట కలిగించాయి. గత కొన్ని రోజులుగా వరసగా పెరుగుతున్న ధరలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. తులం బంగారం 65 వేల రూపాయలకు చేరుకుంటుందని కూడా భయపడ్డారు. పసిడి ధరలు పైపైకి ఎగబాకు తుండటంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధరలు ఇలా...
అయితే తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,600 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,750 రూపాయలుగా నమోదయింది. వెండి ధరలు మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో కిలో 75,300 రూపాయలుగా ట్రేడ్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.


Tags:    

Similar News