మళ్లీ కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న 'ఉల్లి'

ఉల్లి కోయకుండాన కన్నీళ్లు పెట్టిస్తోంది. గతంలో పరుగులు పెట్టిన ఉల్లి ధర.. కేంద్రం చేపట్టిన చర్యల కారణంగా ..

Update: 2023-10-29 05:41 GMT

ఉల్లి కోయకుండాన కన్నీళ్లు పెట్టిస్తోంది. గతంలో పరుగులు పెట్టిన ఉల్లి ధర.. కేంద్రం చేపట్టిన చర్యల కారణంగా ధర పూర్తిగా దిగి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.70 ఉంది. నవంబర్‌ మొదటి వారం నాటికి కిలో ఉల్లి రూ.100కి చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు వారాల్లోనే ఉల్లిధర కిలో రూ.30 నుంచి రూ.70కి చేరిపోయింది. ఉత్తర భారతంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియానా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన తర్వాత ఉల్లి ధరలు పెరుగడం మొదలైంది. గత కొన్ని రోజులుగా హోల్‌సేల్ మార్కెట్ యార్డులలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తోంది.

ప్రస్తుతం క్వింటాల్‌ ధర రూ.4 వేలకు చేరడంతో పాటు రిటైల్‌ మార్కెట్‌లో ధరలు కూడా పెరిగాయి. మరోవైపు హైదరాబాద్‌లో కిలో ఉల్లి రూ.70 పలుకుతోంది. మహారాష్ట్ర రిటైల్‌ మార్కెట్లో ఉల్లి కిలో రూ.70కి పలుకుతోంది. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడం వల్లనే ఉల్లి ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్ – సరఫరా మధ్య అంతరం ఏర్పడి ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం బఫర్ ఉల్లి విక్రయాలను వేగవంతం చేసింది. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్‌లో విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరింత ఉల్లి స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక ఉల్లి ధర అటుంచితే... అల్లం ధర కూడా పెరిగిపోతోంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో అల్లం ధర రూ.160 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ప్రస్తుతం ధర పెగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News