చికెన్ ధరలకు రెక్కలు

శ్రావణ మాసంలో కూరగాయల రేట్లు పెరగడం, చికెన్ ధరలు తగ్గడం మామూలే.

Update: 2023-08-22 17:22 GMT

చికెన్ ధరలకు రెక్కలు

శ్రావణ మాసంలో కూరగాయల రేట్లు పెరగడం, చికెన్ ధరలు తగ్గడం మామూలే. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ , విజయవాడల్లో చికెన్ కేజీ రూ.240 నాటుకోడి కేజీ రూ.420, స్కిన్లెస్ 260 రూపాయలుగా ఉంది. కర్ణాటకలోని బెంగళూరులో కూడా నాన్ వెజ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ.. బాయిలర్ చికెన్ 170రూపాయలు, ఫారన్ చికెన్ 140రూపాయలు నాటు కోడి కేజీ 350రూపాయలు జవారీ చికెన్ 375రూపాయలుగా ఉన్నాయి.

కోళ్ల దాణా రేట్లు పెరగడంతోపాటు డీజిల్,పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ట్రాన్సుపోర్టు ఖర్చులు పెరిగాయని, దీంతో కోళ్ళ ధర పెరిగిందని కోళ్లఫారం యజమానులు చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు శ్రావణమాసమైన కూడా చికెన్ ధరలు ఎక్కువ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగానికి సరిపడా సరఫరా లేకపోవడంతో రెట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

Tags:    

Similar News