ఏడాదికి రూ.330తో రూ.2 లక్షల బెనిఫిట్‌.. మోడీ సర్కార్‌ నుంచి సూపర్‌ స్కీమ్‌

కేంద్రంలోని మోడీ సర్కార్‌ రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు రైతు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నాయి.

Update: 2023-12-25 02:30 GMT

PM Jeevan Jyoti Bima Yojana

కేంద్రంలోని మోడీ సర్కార్‌ రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు రైతు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నాయి. ఇందులో ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

స్కీమ్ బెనిఫిట్స్ ఇవే

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొకడ్ట్ కింద చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో చేరిన వారికి నామమాత్రపు ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ అందిస్తోంది. అంటే ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 2 లక్షలు అందుకోవచ్చు.

ప్రీమియం ఎంత చెల్లించాలి?

ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.330 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.289, ఏజెంట్ కమిషన్ రూ.30, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు రూ.11 కలిసి ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఆటో డెబిట్ సదుపాయం కూడా ఉంటుంది. దీని ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికోసారి రూ.330 డెబిట్‌ అవుతాయి.

పథకంలో చేరడం ఎలా?

ఈ పథకంలో చేరాలంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించిన సరిపోతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. అంటే మీ అకౌంట్ నుంచి మే నెలలో రూ.330 కట్ అవుతాయి. అలాగే పోస్టాఫీస్‌లో ఖాతా ఉన్న వారు పోస్టాపీస్‌కు వెళ్లి పథకంలో చేరవచ్చు.

అర్హులు ఎవరెవరు?

ఈ పథకంలో చేరాలంటే 8 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు. అలాగే బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. ఆధార్‌ కూడా ఉండాల్సిందే.

రూ. 2 లక్షలు ఎలా వస్తాయి?

ఈ పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.330 చెల్లించాలి. అప్పుడు పాలసీ రెన్యూవల్ అవుతూ వస్తుంది. ఇలా డబ్బులు కట్టి పాలసీ తీసుకున్న వారు ఏ కారణం చేతనైనా మరణిస్తే.. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి రూ.2 లక్షల అందజేస్తారు.


Tags:    

Similar News