రైతులకు అలర్ట్..సమయం లేదు మిత్రమా? ఈ పనులు వెంటనే చేయండి
మోడీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్నపథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. దీని వల్ల రైతులు ఏడాదికి..
మోడీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్నపథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. దీని వల్ల రైతులు ఏడాదికి రూ.6 వేల చొప్పున ప్రయోజనం పొందుతున్నారు. ఈ సాయం ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. అయితే దీని కోసం రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ పనులు పూర్తి చేస్తే గానీ 15వ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి. అయితే అక్టోబర్ 15వ తేదీలోపు ఈ మూడు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ-కేవైసీ వెరిఫికేషన్.. ముందుగా మీరు ఈ-కేవేసీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేయకపోయినట్లయితే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లోకి బదిలీ కావని గుర్తించుకోండి.
ల్యాండ్ డేటా సీడింగ్: రైతుకు సంబంధించిన భూమి వివరాలను అధికారులకు అందించాల్సి ఉంటుంది.
ఆధార్ లింక్: మీ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేయకపోయినా ఇబ్బందులు తప్పవుఏ. ఈ మూడు పనులు ఇంకా మీరు పూర్తి చేయకపోతే అక్టోబర్ 15లోపు పూర్తి చేయాలి. లేకుండా పీఎం కిసాన్ నగదు మీకు జమకాదు. ఇంకా ఆరు రోజుల మాత్రమే గడువు..
ఈ పనులను పూర్తి చేయడానికి సమయం దగ్గర పడుతోంది. ఈ లోగా ఈ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. లేకుంటే నగదు అందే అవకాశం ఉండదు. అంటే ఈ పథకం ప్రయోజనం కోల్పోతారన్నట్లు. ఈ పీఎం కిసాన్ 15వ విడత నవంబర్ లో ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధుల బదిలీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 27న 14వ విడత అందించింది. 14వ విడతగా సుమారు రూ. 18,000 కోట్లను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన 8.5 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు.