సుకన్య సమృద్ధి స్కీమ్‌లో రూ.25 లక్షలు రావాలంటే నెలకు ఎంత కట్టాలి?

కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఇక బేటీ బచావో బేటీ పడావో నినాదంలో..

Update: 2023-10-13 06:18 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఇక బేటీ బచావో బేటీ పడావో నినాదంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య నమృద్ధి యోజన పథకం ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డల చదువు, పెళ్లి సమయానికి రిటర్న్స్‌ పొందేలా ఈ పథకాన్ని రూపొందించింది మోడీ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు 14 ఏళ్లపాటు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. 21 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత డబ్బును పొందేదుకు అవకాశం ఉంటుంది.

ఇక ఈ పథకంలో చిన్నారికి పదేళ్ల వయసులోనే చేరొచ్చు. గరిష్టంగా ఇద్దరు ఆడ బిడ్డలకు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్‌ చేయాలంటే ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌, బర్త్ సర్టిఫికేట్‌, ఆడబిడ్డతో పాటు ఆమె తండ్రి ఫొటోల, ఆధార్‌ కార్డు కావాల్సి ఉంటాయి. ఇక ఈ పథకంలో అకౌంట్‌ను మినిమం రూ. 250 డిపాజిట్ చేసి ఓపెన్‌ చేయవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్‌ తెరిచిన నాటి నుంచి 14 ఏళ్ల పాటు డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆరేళ్ల తర్వాత అంటే 21 ఏళ్లకు మెచ్చూరిటీ వస్తుంది. ఈ ఆరేళ్లు ఎలాంటి డిపాజిట్ చేయాల్సి అవసరం ఉండదు.

ఇక అకౌంట్‌ ఓపెన్ చేసి తర్వాత ఏదైనా కారణాలతో డబ్బులు డిపాజిట్ చేయకపోతే సదరు అకౌంట్ అండర్‌ డిఫాల్ట్‌లోకి వెళ్లిపోతుంది. ఒకవేళ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే ఏండాదికి రూ. 50 చొప్పున ఫైన్‌ చెల్లించి అకౌంట్‌ను మళ్లీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్‌ తెరిచిన నాటి నుంచి 15 ఏళ్లలోపు మళ్లీ ఓపెన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా చిన్నారి పెళ్లి నాటికి, లేదా ఉన్న చదువుల నాటికి రూ. 25 లక్షలు చేతికి రావాలంటే నెలకు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

ఉదాహరణకు.. మీ చిన్నారి వయసు ప్రస్తుతం 5 ఏళ్లు అనుకుందాం. ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 55,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 25 లక్షలు చేతికి వస్తాయి. అంటే నెలకు రూ. 4,641 చెల్లిస్తే కూతురు వివాహం సమయానికి రూ. 25 లక్షలు రిటర్న్ పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం మీరు రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. డిపాజిట్‌పై మీకు వచ్చే వడ్డీపై టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకొచ్చే వడ్డీ కూడా టాక్స్ ఫ్రీగానే ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ స్కీమ్‌లో దాదాపు ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మాత్రమే డిపాజిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏడాదికి ఇంత మొత్తంలో డిపాజిట్‌ చేసినట్లయితే ఇంకా అధిక మొత్తం అందుకోవచ్చు. మీరు చేసే డిపాజిట్‌ను బట్టి మెచ్యూరిటీ తర్వాత ఎంత డబ్బు వస్తుందనేదానిపై ఆధారపడి ఉంటుందని గుర్తించకోండి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో వడ్డీని మూడు నెలలకోసారి సవరిస్తుంటుంది. ఆ సమయంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

Tags:    

Similar News