అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం ఆర్బీఐ మరో అడుగు..కొత్త పోర్టల్‌ ప్రారంభం

బ్యాంకింగ్‌ రంగం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే దేశంలోని బ్యాంకుల్లో కొన్ని..

Update: 2023-08-19 06:50 GMT

బ్యాంకింగ్‌ రంగం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే దేశంలోని బ్యాంకుల్లో కొన్ని సంవ్సతరాలుగా ఆన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వెల్లడించేందుకు ఆర్బీఐ మరో కీలక అడుగు ముంకుకేసింది. కొన్ని సంవత్సరాలుగా ఎవ్వరు కూడా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో మగ్గుతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ ఖాతాదారుల వివరాలు తెలుసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ.. ఆన్‌ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను తెలుసుకునేందుకకు ఓ కొత్త వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆ పోర్టల్‌ పేరు ఉద్గమ్‌ (UDGAM - Unclaimed Deposits Gateway to Access Information)పేరిట ప్రారంభించింది ఆర్బీఐ. వినియోగదారులు వివిధ బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

కాగా, పోర్టల్‌ ద్వారా అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తాన్ని పొందేందుకు ఆయా ఖాతాలను పునరుద్ధరించేందుకు పోర్టల్‌ ద్వారా సులభతరం అవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంకు ఖాతాల్లోని నగదు పదేళ్లు, అంతకంటే మించిన వాడుకలో లేకపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌గా పరిగణిస్తున్నాయి బ్యాంకులు. ఖాతాదారులు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్‌ క్లెయిమ్‌ చేయకపోవడంతో ఆ డబ్బంతా బ్యాంకుల్లో పేరుకుపోయింది. అలాంటి ఖాతాల వివరాలు ఆర్‌బీఐ తీసుకువచ్చిన ఉద్గమ్‌ పోర్టల్‌ ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందని ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 6న విడుదల చేసిన డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేటరి పాలసీపై స్టేట్‌మెంట్‌లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను ట్రాక్‌ చేసేందుకు సెంట్రలైజ్డ్‌ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (REBIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (IFTAS) భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి వెబ్‌ పోర్టల్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్‌ లిమిటెడ్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌, సిటీ బ్యాంక్‌ ఉన్నాయి. వచ్చే అక్టోబర్‌ 15 నాటికి మరికొన్ని బ్యాంకుల అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు వివరాలు అందుబాటులోకి రానున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే భారతదేశంలో క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు రూ.35,000 కోట్లు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్బీఐ UDGAM పోర్టల్‌ను ప్రారంభించింది. ఇక్కడ మీరు మీ అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను కనుగొనవచ్చు. అనేక బ్యాంకుల్లో తమ అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఒకే చోట కనుక్కోవడం కోసం ప్రజలకు సహాయపడేందుకు సెంట్రల్ బ్యాంక్ ఈ పోర్టల్‌ని అభివృద్ధి చేసింది.

''క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తంలో పెరుగుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్‌బిఐ ఎప్పటికప్పుడు ప్రజా చైతన్య ప్రచారాలను చేపడుతోంది. ఇంకా ఈ కార్యక్రమాల ద్వారా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను క్లెయిమ్ చేయడానికి వారి సంబంధిత బ్యాంకులను గుర్తించి, సంప్రదించమని ఆర్‌బిఐ ప్రజల సభ్యులను ప్రోత్సహిస్తోంది'' అని ఆర్‌బిఐ తెలిపింది. పోర్టల్‌లో మిగిలిన బ్యాంకుల కోసం శోధించే సదుపాయం అక్టోబర్ 15, 2023 నాటికి దశలవారీగా అందుబాటులోకి వస్తుందని ఆర్‌బిఐ తెలిపింది.

UDGAM పోర్టల్‌లో ఎలా నమోదు చేసుకోవాలి?

☛ వినియోగదారులు UDGAM పోర్టల్‌ను సందర్శించాలి.

☛ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వినియోగదారులు వారి మొబైల్ నంబర్, పేరు, పాస్‌వర్డ్, క్యాప్ఛార్‌ కోడ్‌ ఎంటర్ చేసి, ఆపై సమర్పించాలి. సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు. దీన్ని అనుసరించి, వినియోగదారులు వారి మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా వారి UDGAM ఖాతాకు లాగిన్ చేయవచ్చు.

☛ లాగిన్ పేజీలో వివరాలను నమోదు చేసిన తర్వాత, వారు మళ్లీ OTPని నమోదు చేయాలి.

☛ అక్కడ  వినియోగదారులు ఖాతాదారు పేరు, బ్యాంక్ లేదా బ్యాంకుల పేరు నమోదు చేయాల్సిన పేజీకి దారి మళ్లించబడతారు. అదనంగా పాన్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్ లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను అందించిన తర్వాత వినియోగదారులు సెర్చ్‌పై క్లిక్ చేసి, వారి అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేయవచ్చు.




Tags:    

Similar News