హెచ్చరిక.. అలా ట్రేడింగ్ చేయకూడదు

అనధికారికంగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Update: 2023-11-25 10:43 GMT

అనధికారికంగా ఫారెక్స్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న సంస్థల జాబితాలో మరో 19 సంస్థల పేర్లను ఆర్‌బీఐ చేర్చింది. ఆయా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంస్థల పేర్లతో అలర్ట్ లిస్ట్ విడుదల చేసింది. అనధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ఫారెక్స్ లావాదేవీలను నిర్వహించడం చట్టపరమైన ఇబ్బందుల్లో పడేస్తుందని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా జాబితాలో.. ఎఫ్‌ఎక్స్‌ స్మార్ట్‌బుల్‌, జస్ట్‌ మార్కెట్స్‌, గోడో ఎఫ్‌ఎక్స్‌, అడ్మిరల్‌ మార్కెట్‌, బ్లాక్‌బుల్‌, ఈజీ మార్కెట్స్‌, ఎన్‌క్లేవ్‌ ఎఫ్‌ఎక్స్‌, ఫినోవిజ్‌ ఫిన్‌టెక్‌, ఎఫ్‌ఎక్స్‌ స్మార్ట్‌బుల్‌, ఎఫ్‌ఎక్స్‌ ట్రే మార్కెట్‌, ఫారెక్స్‌4యూ, గ్రోయింగ్‌ కేపిటల్‌ సర్వీస్‌, హెచ్‌ఎఫ్‌ మార్కెట్స్‌ లాంటి సంస్థలున్నాయి.

ఒక ప్రకటనలో, రిజర్వ్ బ్యాంక్ అనధికారిక ఎంటిటీలను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించే ఎంటిటీలు/ప్లాట్‌ఫారమ్‌లు/వెబ్‌సైట్‌ల పేర్లు కూడా అలర్ట్ లిస్ట్‌లో ఉన్నాయని పేర్కొంది. జాబితాలో కనిపించని సంస్థ RBI ద్వారా అధికారం పొందినట్లు భావించకూడదని తెలిపింది. అపెక్స్ బ్యాంక్ రెగ్యులేటరీ బాడీ నిబంధనలను ఉల్లంఘించినందుకు సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లపై మొత్తం ₹10.34 కోట్ల జరిమానాలు విధించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై కోటి రూపాయలు, సిటీ బ్యాంక్‌పై ₹5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాపై ₹4.34 కోట్ల జరిమానాను ఆర్‌బిఐ విధించింది.


Tags:    

Similar News