Hyderabad: హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు పైపైకి.. ఎంతో తెలిస్తే..

Hyderabad: దేశంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూమి కొనాలన్నా.. ప్లాట్‌ తీసుకోవాలన్నా రోజురోజుకు ధరలు

Update: 2023-12-29 14:57 GMT

Hyderabad

Hyderabad: దేశంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూమి కొనాలన్నా.. ప్లాట్‌ తీసుకోవాలన్నా రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే హైదరాబాద్‌ నగరంలో ఇండ్ల ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గజానికి 24శాతం మేర పెరిగినట్లు రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ స్థితిగతులు, ఇండ్ల ధరలను ప్రామాణికంగా తీసుకొని నివేదికను రూపొందించింది. గతేడాది హైదరాబాద్‌లో 47,485 యూనిట్లు అమ్మకాలు జరుగగా, ఈ ఏడాది మొత్తం 61,715 యూనిట్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. గత సంవత్సరంతో 30 శాతం వృద్ధి నమోదైందని అనరాక్‌ నివేదిక తెలిపింది. అయితే వచ్చే ఏడాదిలోనూ ఇండ్ల ధరలు 8-10 శాతం పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది.

ఢిల్లీ కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ..

ఖరీదైన గృహాల క్రయవిక్రయాల్లో దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌ నగరం ముందుందని నివేదిక తెలిపింది. ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌లో ముంబై అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్‌, మూడో స్థానంలో ఢిల్లీ నిలిచాయని నైట్‌ ఫ్రాంక్‌ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 11 శాతం మేర ఇండ్ల ధరలు పెరిగినట్లుగా తెలిపింది. అయితే 30 శాతం మేర ఉన్న చౌకధర ఇండ్ల కొనుగోలు స్థిరంగానే ఉండగా, అత్యంత విలాసవంతమైన ఇండ్లకు మాత్రం హైదరాబాద్‌లో గణనీయంగా డిమాండ్‌ పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు.

Tags:    

Similar News