జియో నుంచి ఎయిర్‌ ఫైబర్‌.. దీని ప్లాన్‌ వివరాలు ఏమిటి?

రిలయన్స్‌ జియో.. టెలికం రంగంలో ఓ సంచలనం సృష్టిస్తోంది. వినియోగదారులకు అనుగుణంగా ప్లాన్స్‌ను రూపొందిస్తూ ..

Update: 2023-09-20 07:48 GMT

రిలయన్స్‌ జియో.. టెలికం రంగంలో ఓ సంచలనం సృష్టిస్తోంది. వినియోగదారులకు అనుగుణంగా ప్లాన్స్‌ను రూపొందిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా రకాలు రీఛార్జ్‌ ప్లాన్స్‌, ఇంటర్నెట్‌, టీవీఛానల్స్‌కు సంబంధించిన సరికొత్త ప్లాన్స్‌ను రూపొందిస్తోంది. ప్రతినెల జియో తన కస్టమర్లను మరింతగా పెంచుకుంటూ ఇతర టెలికం కంపెనీలను వెనక్కి నెట్టేస్తోంది. తాజాగా మరో సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా ప్రకటించినట్లుగానే రిలయన్స్ జియో గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం జియో తన ఎయిర్‌ఫైబర్ సేవలను బెంగళూరుతో సహా ఎనిమిది నగరాల్లో ప్రారంభించింది. Jio AirFiber ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో అందుబాటులో ఉంది. జియో ఎయిర్‌ఫైబర్‌లో నెలకు రూ. 599 నుంచి రూ. 3,999 వరకు వివిధ ప్లాన్‌లు అందిస్తోంది జియో. JioFiberలో లభించే చాలా ఫీచర్లు AirFiberలో కూడా అందుబాటులో ఉన్నాయి. 1 GB వరకు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందవచ్చు.

AirFiber అంటే ఏమిటి?

ఇది వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్. ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఎయిర్‌ ఫైబర్‌ ఇంటర్నెట్ స్పీడ్‌ని ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వలె వేగంగా అందించగలదు. ఇంటర్నెట్ వేగం 1 GB వరకు ఉంటుంది. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కేబుల్ రూట్ చేయడం కష్టంగా ఉంటే ఎయిర్‌ఫైబర్‌ ప్రత్యామ్నాయ ఎంపిక. అయితే ఈ ప్లన్ లాంఛ్ సందర్బంగా జియో ఈ ప్లాన్స్ కు సంబంధించిన వివరాలను ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం..

జియో ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్‌ల ధర ఎంత?

జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) 550 కంటే ఎక్కువ డిజిటల్ ఛానెల్‌లు, 14 కంటే ఎక్కువ OTT యాప్‌లతో పాటు మెరుగైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. దీని ప్లాన్‌లు రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి. ఇది 30 Mbps వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్‌ని అందిస్తోంది. రూ. 3,000 ప్లాన్‌కు 1 Gbps వేగవంతమైన డేటాను అందిస్తోంది.
☛ రూ. 599 ప్లాన్: 30 Mbps ఇంటర్నెట్

☛ రూ. 899 ప్లాన్: 100 Mbps ఇంటర్నెట్

☛ రూ. 1,199 ప్లాన్: 100 Mbps ఇంటర్నెట్

☛ రూ. 1,499 ప్లాన్: 300 Mbps వేగం

☛ రూ. 2,499 ప్లాన్: 300 Mbps వేగం

☛ రూ. 3,999 ప్లాన్: 1,000 Mbps వేగం

మరోవైపు, జియో ఫైబర్ ప్లాన్‌లు రూ. 399 నుంచి ప్రారంభమై రూ. 3,999 వరకు ఉంటాయి. జియో ఎయిర్‌ ఫైబర్‌ కనెక్షన్ పొందాలనుకునే వారు వాట్సాప్‌ (WhatsApp) ద్వారా 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. జియో వెబ్‌సైట్ లేదా జియో స్టోర్‌ని సందర్శించడం ద్వారా కూడా ఈ సర్వీసును పొందవచ్చు.
Tags:    

Similar News