Jio: ఇక జియోలో ఆ రెండే వార్షిక ప్లాన్స్‌.. అవేంటో తెలుసా?

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ ప్రవేశపెడుతోంది

Update: 2024-07-14 13:32 GMT

Jio

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ ప్రవేశపెడుతోంది. ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు టారీఫ్‌ ధలను పెంచేశాయి. అయితే గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్లను అందించిన జియో.. తర్వాత వాటిని రెండుకు తగ్గించింది. ఈ రెండింటి ప్రయోజనాల్లోనూ మార్పులు చేసింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో అసలు వార్షిక ప్లాన్లే లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జియో అందిస్తున్న ఆ రెండు యాన్యువల్‌ ప్లాన్లేంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

రూ.3,999 ప్లాన్‌..

జియో అందిస్తున్న రూ.3,999 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2.5జీబీ డేటా అందిస్తోంది. ఫ్యాన్‌కోడ్‌, జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి. ఫ్యాన్‌కోడ్‌ సభ్యత్వం జియోటీవీ మొబైల్‌ యాప్, జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌లో ప్రీమియం కంటెంట్ ఉండదు. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం అదనం.

రూ.3,599 ప్లాన్‌..

ఇక మరో ప్లాన్‌ రూ.3,599. ఇందులో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2.5జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌. జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అపరిమిత 5జీ డేటా ఉచితం. దీంట్లోనూ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం కంటెంట్ ఉండదని గమనించండి.

Tags:    

Similar News