2023లో యూజర్లు ఎక్కువగా డిలీట్ చేసిన పాపులర్‌ యాప్ ఇదే.. ఎందుకంత కసి

ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది జీవితంలో ఓ భాగంగా మారిపోయంది. చాలా మంది ప్రతిరోజు సోషల్‌ మీడియాను అనుసరించని

Update: 2023-12-27 13:49 GMT

 Popular Social Media App

ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది జీవితంలో ఓ భాగంగా మారిపోయంది. చాలా మంది ప్రతిరోజు సోషల్‌ మీడియాను అనుసరించని రోజంటూ ఉండదు. ఏదైనా వైరల్‌ కావాలంటే అది సోషల్ మీడియా అనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్‌లలో సోషల్‌ మీడియా ద్వారా స్నేహితులు, కమ్యూనిటీలతో కనెక్ట్ అవుతూ దాన్నే ప్రపంచంగా మలుచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.8 బిలియన్ల మంది ప్రజలు ఏదో సోషల్ మీడియాను వినియోగిస్తూ స్మార్ట్‌ ఫోన్‌లలో మునిగి తేలుతున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 59.9శాతం. అదే ఇంటర్ నెట్ వినియోగిస్తున్న వారిలో 92.7శాతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ ఆధారంగా పనిచేసే టీఆర్జీ డేటా సెంటర్ పేర్కొంది.

అంతేకాక ప్రజలు ప్రతి రోజూ సగటున 2 గంటల 24 నిమిషాలు సోషల్ మీడియాలో సమయం గడుపుతున్నారని పేర్కొంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఇంత పాపులారిటీ సాధించిన సోషల్ మీడియా యాప్స్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కూడా అదే సంస్థ వెల్లడించింది. అదేంటంటే వినియోగదారులు డిలీట్ చేసిన యాప్స్ లో కూడా సోషల్ మీడియాలో యాప్సే ఉన్నాయంట!

ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రజలు అత్యధికంగా డిలీట్ చేసిన వాటిల్లో ఈ సోషల్ మీడియా యాప్సే ఉన్నాయి. వాటిల్లో ఫేస్ బుక్, వీచాట్, టిక్ టాక్, ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, ఎక్స్(ట్విట్టర్) వంటివి కూడా ఉన్నాయి. చాలా మంది వినియోగదారులు ‘హౌ టు డిలీట్(సోషల్ మీడియా యాప్ పేరు) అకౌంట్’ అనే పదాన్ని గూగుల్ లో ఎక్కువగా సెర్చ్‌ చేశారని, దాని ఆధారంగా తీసుకున్న డేటా ప్రకారం ఫేస్ బుక్ 3.03 బిలియన్ యూజర్లు, యూ ట్యూబ్ 2.49 బిలియన్ యూజర్లు, వాట్సాప్ 2 బిలియన్ యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ రెండు బిలియన్ యూజర్లు డిలీట్ కోసం వెతికారని తెలిపింది. దీని ఆధారంగా పరిశీలిస్తే ఏ సోషల్ మీడియా యాప్ ను వినియోగదారులు ఎక్కువగా డిలీట్ చేస్తున్నారో గుర్తించింది.

అత్యధికంగా డిలీట్ అయిన యాప్ ఇదే..

యూఎస్ ఆధారిత టీఆర్జీ డేటా సెంటర్ అందించిన లెక్కల ప్రకారం వినియోగదారులు అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఇన్ స్టాగ్రామ్. దీనిని ఎలా డిలీట్ చేయాలని ఒక బిలియన్ కంటే ఎక్కువమంది గూగుల్లో వెతికారు. వాస్తవానికి ప్రస్తుతం అత్యధిక శాతం మంది వినియోగిస్తున్న ట్రెండింగ్ ప్లాట్ ఫారం ఇన్ స్టాగ్రామే. అలాంటిది దానినే ఎక్కువమంది డిలీట్ చేయడం ఆసక్తికలిగించే అంశమే. దీని తర్వాత మెటాకు చెందిన ఫోటో షేరింగ్ యాప్ స్నాప్ చాట్ ఉంది. దీనిని 2023లో 1,30,000 మంది వినియోగదారులు డిలీట్ చేశారు. మూడో స్థానంలో ట్విట్టర్(ఎక్స్) ఉంది. దీనికి 71,700 సెర్చ్ రిక్వెస్ట్ లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో టెలిగ్రామ్ 49,000, ఫేస్ బుక్ 24,900 డిలీట్ లతో ఉన్నాయి.


Tags:    

Similar News