State Bank Of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చిందిగా!!

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఊహించని షాక్

Update: 2024-07-15 08:53 GMT

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఊహించని షాక్ ఇచ్చింది. జూలై 15 నుంచి అమల్లోకి వచ్చేలా దాని బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. MCLRతో అనుసంధానించిన రుణాలపై SBI వడ్డీ రేట్లు కూడా పెంపు తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఒక నెల కాల వ్యవధి రుణాలపై రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.35 శాతానికి, మూడు నెలల కాల వ్యవధి రుణాలపై MCLR 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.40 శాతానికి చేరుకుంది. ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండేళ్ల కాలానికి MCLR రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచి వరుసగా 8.75 శాతం, 8.85 శాతం, 8.95 శాతానికి చేరాయి. ఈ వడ్డీ రేట్ల పెంపుతో పర్సనల్ లోన్, ఆటో లోన్, హోం లోన్లు వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అంతకు ముందు జూన్ నెలలో కూడా ఎస్బీఐ లోన్ వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్ల మేర పెంచి 8.35 శాతానికి చేర్చింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.30 శాతం నుంచి 8.40 శాతానికి చేర్చింది. మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచి 9 శాతానికి చేర్చింది. SBI వడ్డీ రేట్లు పెంచడంతో ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇతర బ్యాంకుల MCLR పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది.


Tags:    

Similar News