UPI చెల్లింపులపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో డిజిటల్‌ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు బ్యాంకులకు..

Update: 2023-11-29 15:01 GMT

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో డిజిటల్‌ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరిపేవారు.. ఇప్పుడు ఇంట్లో కూర్చుండి స్మార్ట్‌ ఫోన్‌లో క్షణాల్లో లావాదేవీలు చేసేస్తున్నారు. అయితే టెక్నాలజీ పెరిగడంతో పాటు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. దుండగులు కూడా టెక్నాలజీని ఉపయోగించి మోసగిస్తున్నారు. అయితే బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లావాదేవీలను రద్దు చేసుకోవడం: ఇద్దరు వియోగదారుల మధ్య జరిగే లావాదేవీలు పూర్తి కావాడనికి నిర్ధిష్ట సమయాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేయాలంటే క్షణాల్లో జరిగిపోతాయి. ఎవరికైనా పంపించాలంటే వెంటనే పూర్తవుతాయి.

మొదటిసారి ఇద్దరు వినియోగదారుల మధ్య డిజిటల్ చెల్లింపు పూర్తి చేయడానికి కనీసం నాలుగు గంటల సమయం రిజర్వ్‌గా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానం రూ. 2000, అంతకంటే ఎక్కువ చెల్లింపులపై అమలు చేయనుంది. ఇది UPIతో పాటు IMPS, RTGS వంటి అన్ని ఇతర డిజిటల్ చెల్లింపులను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్త UPI ఖాతా నుంచి మొదటి 24 గంటల్లో గరిష్టంగా రూ. 5,000 పంపవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం.. రూ. 2000 కంటే ఎక్కువ మొదటి డిజిటల్ చెల్లింపుపై 4 గంటల పరిమితి విధించనుంది ప్రభుత్వం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఫస్ట్ ట్రాన్సాక్షన్​ కంప్లీట్ కావడానికి దాదాపు 4 గంటల సమయం ఉండాలని చూస్తున్నట్టు సమాచారం.

వినియోగదారులు తమ చెల్లింపును రివర్స్ చేసుకోవచ్చు.. లేదా మొత్తాన్ని మార్చవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక ప్రకారం.. 2022-23లో 13,530 మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇందులో 30,252 కోట్ల రూపాయల వరకు మోసం జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నది చూడాలి.

Tags:    

Similar News